‘గురు పర్వ’ సందర్భం గా మీ అందరికి అనేకానేక శుభాకాంక్షలు. బహుశా ఇది గురు నానక్ దేవ్ జీ మరియు మహనీయ గురు పరంపర యొక్క ఆశీస్సుల వల్లనే కావచ్చు .. నా వంటి ఒక సాధారణమైన వ్యక్తి కి కొన్ని మంచి మరియు పవిత్రమైనటువంటి కార్యాలు చేసేందుకు అవకాశం లభించింది. ఈ కారణం గా ఈ రోజు న ఇక్కడ ఏదయినా మంచి పని జరుగుతోందంటే అది ఇటువంటి గురు జనులు మరియు సంతు సాధువుల ఆశీర్వాదాల ఫలితంగానే జరుగుతోంది. మాకు ఎటువంటి ప్రాముఖ్యం లేదు. అందువల్ల ఈ గౌరవానికి నేను నోచుకోలేను. ఈ మహాపురుషులు మరియు గురు జనులు ఎవరైతే శతాబ్దాల తరబడి వారి యొక్క త్యాగాలతో, తపస్సు తో ఈ దేశాన్ని సృష్టించారో, మరి ఈ దేశాన్ని కాపాడారో వారికే ఈ గౌరవం అంతా కూడాను దక్కవలసివుంది.
గుజరాత్ లో వినాశకారక భూకంపం సంభవించినప్పుడు, కచ్ఛ్ లోని లఖ్ పత్ ప్రాంతం ఎక్కడైతే గురునానక్ దేవ్ జీ తాను జీవించినప్పుడు ఉండే వారో ఆ ప్రాంతం సైతం దెబ్బతింది. గురు నానక్ దేవ్ జీ అనుబంధం పెంచుకొన్న గురుద్వారా లఖ్ పత్ ప్రాంతం లో ఉంది. ఆయన ధరించిన పాంకోళ్లు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. భూకంపం వల్ల గురుద్వారా ధ్వంసమైంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఎన్నికైన తరువాత చేసిన మొట్టమొదటి పని కచ్ఛ్ భూకంప బాధితులకు పునర్ నిర్మాణ పనులను చేపట్టడం. బాగా దెబ్బతిన్న గురుద్వారా ను కూడా నేను సందర్శించాను. పరంపర అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాల తో నేను ఎంతో కొంత చేయవలసిన వుందని నాకు తోచింది. మరి దానిని పునర్ నిర్మించాలని నేను నిర్ణయించాను. అయితే ఒక విషయం నన్ను కలత పెట్టింది. దాని పునర్ నిర్మాణానికి వినియోగించవలసిన అదే రకం సామగ్రి తో పాటు, సరైన వ్యక్తులకై మేము అన్వేషించవలసి వచ్చింది. ఆ గురుద్వారా ను అది ఏ విధంగా ఉండేదో అదే మాదిరిగా పునర్ నిర్మించాల్సి వచ్చింది. మరి ఆ ప్రదేశం ఇవాళ ప్రపంచ వారసత్వ స్థలాల లో స్థానాన్ని సంపాదించుకొంది.
తక్కువ ఖర్చు తో విమాన యానానికి ఉద్దేశించిన యుడిఎఎన్ (‘ఉడాన్’) పథకాన్ని మేము ప్రారంభించిన తరువాత ఈ పథకం పరిధి లోకి వచ్చిన మొదటి రెండు ప్రదేశాలలో నాందేడ్ సాహిబ్ ఒక ప్రదేశం. నాందేడ్ సాహిబ్ యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయనే నేననుకొంటున్నాను. పలు సంవత్సరాల పాటు పంజాబ్ లో పని చేసే భాగ్యం నాకు దక్కింది. అటు తరువాత మీ అందరితో కలసి పంజాబ్ లో నివసించడం, అలాగే బాదల్ గారి కుటుంబాని కి సన్నిహితంగా ఉండటం తో నేను ప్రస్తుతం అనేక విషయాలను తెలుసుకొని, అర్థం చేసుకోగలుగుతున్నాను. నేను గుజరాత్ లో ఉండివుంటే ఇది సాధ్యపడేది కాదు. గుజరాత్ కు మరియు పంజాబ్ కు మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉన్నదని, దీనికి ‘పంచ్-ప్యారే’ లలో ఒకటి గుజరాత్ యొక్క ద్వారిక తో ముడిపడి ఉండటం కారణమని నేను సదా విశ్వసించాను. ఈ కారణంగా మేము ద్వారిక ఉన్నటువంటి జామ్ నగర్ జిల్లా లో గురు గోవింద్ సింహ్ జీ పేరిట ఒక పెద్ద ఆసుపత్రి ని నిర్మించాం. మన దేశం లో ప్రతి మూలన నెలకొన్న మహానుభావులు మన దేశం కోసం అందించిన ఏకత మంత్రాలు, గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రభోదాలు మన దేశ సాంస్కృతిక వారసత్వాల యొక్క సారం గా ఉన్నాయి. గురు బాణి లో మనం దీనిని అనుభూతి చెందవచ్చును. మనం ఏకత ను దర్శించవచ్చును. ప్రతి ఒక్క మాట కూడా ప్రతి అంశాన్ని సులభతరమైన రీతి లో వివరిస్తూ, మనకు మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. ఇది అన్ని సామాజిక దురాచారాలకు పరిష్కారాలను చూపించింది. అలాగే, ఆ కాలం లో వర్గ విభేదాలు తదితర సమస్యల కు ఎంతో సులువైన పరిష్కారాల ను సూచించింది. అది వర్గాలకు మరియు వర్గ విభేదాలకు స్వస్తి పలకడానికి ప్రయత్నించింది. ఏకత ను ప్రోత్సహించడానికి, ప్రతిదీ దైవానికి అంకిత భావం తో జరిగేటట్టు చూసింది. అటువంటి గొప్ప సంప్రదాయాలు ప్రతి ఒక్కరి కి ప్రేరణ ను అందించుగాక. గురుబాణి కన్నా, గురు నానక్ జీ ఇచ్చిన ఆదేశాల కన్నా, అఖండత, ఇంకా సమైక్యతల సందేశం కన్నా మిన్న అయినటువంటిది ఏదీ లేదు. దేశం యొక్క సమైక్యత, ఇంకా సమగ్రత ల తాలూకు ఒక బలమైన సందేశాన్ని మనం పొందాం.
కర్ తార్‌పుర్ యొక్క ఈ నిర్ణయం క్రీ.శ. 1947వ సంవత్సరం లో ఏదైతే జరిగిందో అది గతించిన విషయం అని నేను నమ్ముతాను; ప్రభుత్వాలకు మరియు సైన్యాలకు మధ్య చోటు చేసుకొన్న కొన్ని అంశాలను అలాగే ఉండనివ్వండి.. వాటికి ఏవైనా పరిష్కారాలు సమకూరాయంటే గనక వాటిని కాలం చూపిస్తుంది. కానీ, ప్రజలకు, ప్రజలకు మధ్య బంధం అనేది దాని యొక్క ఓ గొప్ప శక్తిగా ఉంటుంది. బెర్లిన్ గోడ కూలిపోతుందని ఎవరు మాత్రం అనుకున్నారు? గురు నానక్ జీ యొక్క ఆశీర్వచనాల తో బహుశా కర్ తార్‌పుర్ కారిడోర్ కేవలం ఒక కారిడోర్ గానే మిగిలి పోవటం కాకుండా ప్రజలను జోడించేందుకు ఒక హేతువు గా కూడా నిరూపణ కాగలదని బహుశా ఎవరు అనుకొనివుంటారు. గురుబాణి లోని ప్రతి పదం మనకు శక్తి ని ప్రసాదించగలుగుతుంది. ‘‘వసుధైవ కుటుంబకమ్’’ అనే సిద్ధాంతం మధ్య మనమందరం పెరిగాం. ఈ మాట లకు- ప్రపంచం అంతా ఒకే పరివారం- అని భావం. ఇతరులకు ఏదైనా చెడు జరగాలని ఎన్నడూ తలంచని వారం మనం. దాదాపు 550 సంవత్సరాల క్రితం- రవాణా కు సరైనటువంటి సాధనాలు లేని కాలం లో- గురు నానక్ దేవ్ జీ అసమ్ నుండి కచ్ఛ్ వరకు కాలి నడకన దేశం అంతటా ప్రయాణించారు. ఆయన తన పాదయాత్ర ద్వారా యావత్తు భారతదేశాన్ని ఒక్కటి చేశారు. వారి ధ్యాన సాధన, ఇంకా తపస్సు అంతటివి. ఈ రోజు న ఈ గురు పర్వ్ మనందరికీ ఒక కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను ఇవ్వుగాక! దేశాన్ని సమైక్యం గా, సమగ్రం గా ఉంచేందుకు తగిన శక్తి ని ఇవ్వుగాక! కలసి ఉండటం లో బలం ఉంది. ‘లంగర్’ ఓ ఘన సంప్రదాయం. కేవలం అన్న ప్రసాదాన్ని వడ్డించే ఒక పద్ధతి కాదు, అది ఒక విలువ. అంతేకాదు, అది ఒక వారసత్వం. ఇందులో ఎటువంటి వివక్షకు తావు లేదు. ఈ విధమైన ఘనమైన తోడ్పాటు ను ఇంత సరళ పద్ధతి లోకి మార్చడం జరిగింది. నేటి ఈ పవిత్ర సందర్భం లో గురు గ్రంథ్ సాహిబ్ సమక్షం లో ఈ ఘన సంప్రదాయానికి శిరస్సు ను వంచి ప్రణమిల్లుతున్నాను. గురువుల ఘన త్యాగాలకు మరియు వారి యొక్క తపశ్శక్తి కి వందనమాచరిస్తున్నాను. మీరు నాకు ఇచ్చినటువంటి ఈ సమ్మానం నాది కాదు. ఈ సమ్మానం ఇటువంటి గొప్ప సంప్రదాయానికి చెందేటటువంటి గౌరవం. మనం ఎంతగా పాటుపడినప్పటికీ కూడా ఇది సరిపోదు. మరింత ఉత్తమమైన పని ని చేయడానికి మనమందరం తగినటువంటి బలాన్ని పొందుదుము గాక! మీ అందరికీ నేను మరొక్కమారు నా యొక్క కృతజ్ఞత లను వ్యక్తం చేస్తున్నాను.
**
Today, on the auspicious occasion of Shri Guru Nanak Dev Ji’ Jayanti, attended a programme at my colleague, Smt. @HarsimratBadal_ Ji’s residence.
— Narendra Modi (@narendramodi) November 23, 2018
Over Kirtans, we all remembered the noble ideals and message of Shri Guru Nanak Dev Ji. pic.twitter.com/Qm9vd7eQLz