Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సీతారాం ఏచూరి మృతికి ప్రధాన మంత్రి సంతాపం


మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ సీతారాం ఏచూరి మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“శ్రీ సీతారాం ఏచూరి గారి మరణం బాధాకరం. వామపక్షాలకు మార్గదర్శిగా నిలిచిన ఆయన రాజకీయాల్లో అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా గుర్తింపు పొందారు. సమర్థవంతమైన పార్లమెంటేరియన్ గా కూడా తనదైన ముద్ర వేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసిన మనఃపూర్వక సందేశంలో శ్రీ మోదీ పేర్కొన్నారు.