Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సిద్ధ‌గంగ మ‌ఠాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాన మంత్రి, శ్రీ‌ శ్రీ శివ‌కుమార్ స్వామీజీ స్మార‌క వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న శాల కు శంకుస్థాప‌న


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌ర్నాట‌క లోని తుమ‌కూరు లో గ‌ల శ్రీ సిద్ధ‌గంగ మఠాన్ని సంద‌ర్శించి, శ్రీ శ్రీ శివ‌కుమార్ స్వామీజీ స్మార‌క మ్యూజియాని కి శంకుస్థాప‌న చేశారు.

తుమ‌కూరు లో ఉన్న శ్రీ సిద్ధ‌గంగ మ‌ఠం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ ప్ర‌సంగిస్తూ, తాను ఇంత‌టి ప‌విత్ర‌మైన భూమి లో నుండి 2020వ సంవ‌త్స‌రాన్ని మొద‌లుపెడుతుండ‌టం త‌న అదృష్ట‌మ‌ని పేర్కొన్నారు. శ్రీ సిద్ధ‌గంగ మ‌ఠం యొక్క పావ‌న‌మైన శ‌క్తి మ‌న దేశ ప్ర‌జ‌ల జీవితాల ను సుసంప‌న్నం చేస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

‘‘మ‌నం అంతా పూజ్య స్వామి శ్రీ శ్రీ శివకుమార్ జీ మ‌న మ‌ధ్య లేని లోటును అనుభూతిస్తున్నాము. కేవ‌లం ఆయ‌న దృష్టి పుష్టి ని ప్ర‌సాదించేది గాను, ప్రేర‌ణ ను అందించేది గాను ఉండ‌టాన్ని నేను స్వ‌యం గా గ్ర‌హించాను. వారి స్ఫూర్తిదాయ‌క‌మైన వ్య‌క్తిత్వం తో ఈ ప‌విత్ర‌మైన ప్ర‌దేశం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి స‌మాజాని కి ఒక దిశ ను అందిస్తూ వ‌చ్చింది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

‘‘శ్రీ‌శ్రీ శివ‌కుమార్ జీ స్మృతి లో నిర్ణించ‌బోయే మ్యూజియాని కి పునాది రాయి ని వేసే అవ‌కాశం ల‌భించ‌డం నా సుకృతం. ఈ మ్యూజియ‌మ్ ప్ర‌జ‌ల కు ప్రేర‌ణ ను అందించ‌డం మాత్ర‌మే కాకుండా, స‌మాజాని కి మ‌రియు దేశాని కి దిశ ను అందించే ప‌ని ని కూడా చేస్తుంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

భార‌త‌దేశం ఒక నూత‌న‌మైన శ‌క్తి తో మ‌రియు అక్ష‌య‌మైన‌టువంటి ఉత్సాహం తో 21వ శతాబ్ద‌పు మూడ‌వ ద‌శాబ్దం లోకి అడుగుపెట్టింద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

గ‌త ద‌శాబ్ది ఏ విధం గా మొద‌లైందీ అనేది దేశ ప్ర‌జ‌లు జ్ఞాప‌కాని కి తెచ్చుకోవాల‌ని ఆయ‌న కోరారు. దానికి భిన్నం గా 21వ శాతాబ్దం తాలూకు మూడో ద‌శాబ్దం ఆశ‌లు, ఆకాంక్ష‌ల యొక్క ఒక బ‌ల‌మైన అడుగు తో ఆరంభం అయింద‌ని ఆయ‌న అన్నారు.

‘‘ఒక న్యూ ఇండియా కోసం ఆకాంక్ష త‌లెత్తింది. ఈ ఆకాంక్ష యువ స్వ‌ప్నాల తో కూడుకొని ఉంది. ఇది దేశం లోని సోద‌రీమ‌ణులు మ‌రియు పుత్రిక‌ల యొక్క ఆకాంక్ష గా ఉంది. ఈ ఆకాంక్ష దేశం లో పేద‌లు, అణ‌చివేత కు గురి అయిన వ‌ర్గాలు, నిరాద‌ర‌ణ కు లోనైన వ‌ర్గాలు, పీడ‌న బారిన ప‌డిన వ‌ర్గాలు, వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, ఆదివాసీల ఆకాంక్ష’’ అని ఆయ‌న వివ‌రించారు.

‘‘ఇది భార‌త‌దేశాన్ని ఒక స‌మృద్ధ‌మైన‌టువంటి, స‌మ‌ర్ధ‌మైన‌టువంటి మ‌రియు స‌ర్వ‌త్రా విస్త‌రించిన‌టువంటి ప్ర‌పంచ శ‌క్తి గా చూడాల‌నుకొంటోంది. సంక్ర‌మించిన‌టువంటి స‌మ‌స్య‌ల ను ప‌రిష్క‌రించ‌వ‌ల‌సి ఉంద‌న్న అంశం భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్కరి అంత‌రంగం లో పాదుకొంది. స‌మాజం నుండి ఆవిర్భ‌విస్తున్న‌టువంటి ఈ యొక్క సందేశం మా యొక్క ప్ర‌భుత్వాని కి ప్రేర‌ణ ను అందిస్తూ, ప్రోత్స‌హిస్తున్న‌ది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ప్ర‌జ‌లు వారి యొక్క ప్రాణాల ను కాపాడుకోవ‌డం కోసం, వారి యొక్క పుత్రిక‌ల ప్రాణాల ను కాపాడుకోవ‌డం కోసం పాకిస్తాన్ నుండి భార‌త‌దేశాని కి వ‌చ్చేశార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పాకిస్తాన్ కు వ్య‌తిరేకం గా ప్ర‌జ‌లు ఎందుకు మాట్లాడ‌రు అనేట‌టువంటి ఒక ప్ర‌శ్న దేశం లోని ప్ర‌తి వ్య‌క్తి లో ఉంద‌ని, దానికి బ‌దులు గా ఇటువంటి వ్య‌క్తుల కు వ్య‌తిరేకం గా ప్ర‌ద‌ర్శ‌న లు జ‌రుగుతూ ఉన్నాయ‌ని కూడా ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశ పార్ల‌మెంటు కు వ్య‌తిరేకం గా ఆందోళ‌న ప‌థం లో సాగుతున్న‌వారిని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ఇలా అన్నారు.. ‘‘మీరు గ‌నుక ఆందోళ‌న చేయాల‌నుకొంటే, మీ యొక్క గ‌ళాల ను గ‌డ‌చిన 70 సంవ‌త్స‌రాలు గా పాకిస్తాన్ దుష్కృత్యాల‌ కు విరుద్ధం గా, బిగ్గ‌ర గా వినిపించండి. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ స్థాయి లో పాకిస్తాన్ యొక్క ఈ చ‌ర్య ను బ‌హిర్గ‌తం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. మీరు నినాదాలు చేయాలి అనుకొంటే, అటువంట‌ప్పుడు పాకిస్తాన్ లో యాత‌న‌ల కు గురి అవుతున్న అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల యాత‌న‌ల‌ కు సంబంధించిన నినాదాల ను ఎలుగెత్తి ప‌ల‌కండి. మీకు గ‌నుక ప్ర‌ద‌ర్శ‌న‌ ను నిర్వ‌హించాల‌ని ఉంటే, అటువంట‌ప్పుడు పాకిస్తాన్ లోని హిందూ ద‌ళిత బాధితుల కు వ్య‌తిరేకం గా ఒక ప్ర‌ద‌ర్శ‌న ను నిర్వ‌హించండి’’

3 సంక‌ల్పాల ప‌ట్ల సంత్ స‌మాజ్ యొక్క క్రియాశీల మ‌ద్ధ‌తు ను ప్ర‌ధాన మంత్రి పొంద‌గోరారు.

వాటిలో ఒక‌టోది ఏమిటంటే, ప్ర‌తి ఒక్క వ్య‌క్తి తాలూకు విధులు మ‌రియు బాధ్య‌త‌ల కు ప్రాముఖ్యాన్ని ఇచ్చేట‌టువంటి భార‌త‌దేశ ప్రాచీన సంస్కృతి ని బ‌ల‌వ‌త్త‌ర ప‌ర‌చాల‌ని అనేది.

రెండోదేమో – ప్ర‌కృత‌ని మ‌రియు ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించాల‌నేది.

మ‌రి మూడోది – జ‌ల సంర‌క్ష‌ణ ప‌ట్ల‌, ఇంకుడు గుంతల నిర్వ‌హ‌ణ ప‌ట్ల‌, ప్ర‌జ‌ల లో జాగృతి ని విస్త‌రింప చేయ‌డంలో స‌హ‌క‌రించాలి అనేది.

భార‌త‌దేశం ఎల్ల‌వేళ‌లా సాధువులు, మునులు, గురువుల ను స‌రిఅయిన మార్గాన్ని చూపించేట‌టువంటి ఒక దీప స్తంభం గా భావించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.