Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సిద్ధేశ్వర స్వామి జీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


శ్రీ సిద్ధేశ్వర స్వామి జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.  పరమపూజ్య శ్రీ సిద్ధేశ్వర స్వామి జీ ని సమాజాని కి ఆయన చేసిన విశిష్ఠ సేవ కు గాను స్మరించుకోవడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు.  

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘పరమ పూజ్య శ్రీ సిద్ధేశ్వర స్వామి జీ ని సమాజాని కి ఆయన చేసిన విశిష్ఠమైన సేవ కు గాను స్మరించుకోవడం జరుగుతుంది.  ఇతరుల ఉన్నతి కోసం ఆయన అలుపెరుగక కృషి చేశారు.  ఆయన లోని పాండితీపరమైన అభినివేశాని కి గాను కూడాను ఆయన ను గౌరవించడం జరిగింది.  ఈ దుఃఖ ఘడియ లో, స్వామి జీ యొక్క అసంఖ్యాక భక్త జనాని కి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/ST