Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి


 

శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్‌ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో దగాపడ్డ వర్గాల అభ్యున్నతితోపాటు సమానత్వం, కరుణ, న్యాయం.. వంటి విలువలను పెంపొందింపచేయడానికి శ్రీ ఠాకుర్ కృషి చేశారంటూ శ్రీ మోదీ ప్రశంసించారు. ఈ ఏడాది మతువా ధర్మ మహా మేళాకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  

ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో:
‘‘శ్రీ శ్రీ హరిచంద్ ఠాకుర్‌కు ఆయన జయంతి సందర్భంగా నివాళులు. సేవ చేయడం, ఆధ్యాత్మికత.. వీటి ప్రాముఖ్యాన్ని ఆయన ఉద్బోధించి, అసంఖ్యాక ప్రజల హృదయాల్లో చిరంజీవిగా ఉన్నారు. సమాజంలో మోసానికి గురైన వర్గాల అభ్యున్నతికీ, సమానత్వం, కరుణ, న్యాయం.. ఈ విలువలను పెంపొందింపచేయడానికీ ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఠాకుర్‌నగర్‌ను, బంగ్లాదేశ్‌లో ఓరకాండీని నేను సందర్శించి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాను. ఆ సందర్భాలను నేను ఎన్నటికీ మరచిపోను.
మతువా సముదాయ వైభవోపేత సంస్క‌తిని కళ్లెదుట నిలిపే మతువా ధర్మ మహా మేళా 2025 ( #MatuaDharmaMahaMela2025)కు నా శుభాకాంక్షలు. మతువా సముదాయం సంక్షేమానికి మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మరి మేం రాబోయే కాలంలో కూడా వారి శ్రేయం కోసం అలుపెరుగక పని చేస్తూనే ఉంటాం.
జై హరిబోల్. @aimms_org ” అని పేర్కొన్నారు.