Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి మృతికి ప్రధానమంత్రి సంతాపం


సీనియర్ లీడర్ శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.  శ్రీ శ్యాందేవ్ రాయ్ చౌధరి జీవించి ఉన్నంత కాలమూ ప్రజలకు సేవ చేయడానికే అంకితం కావడంతో పాటు కాశీ అభివృద్ధికి కూడా సార్థక సేవను అందించారని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘శ్యాందేవ్ రాయ్ చౌధరి గారు తన జీవనాన్నంతటినీ ప్రజా సేవకే సమర్పించిన భాజపా వరిష్ఠ నేత. ఆయన మనను వీడి వెళ్లడంతో అత్యంత దు:ఖం కలిగింది. ఆయనను మనమందరం స్నేహ భావంతో ‘దాదా’ అని పిలిచే వాళ్లం. పార్టీ కి నారు-నీరు పోయడంలో ఆయన ముఖ్య తోడ్పాటును అందించారు. అంతే కాదు, కాశీ అభివృద్ధికి పూర్తి అంకితభావంతో నిమగ్నమయ్యారు. ఆయన నిష్క్రమణ కాశీతో పాటు యావత్తు రాజకీయ జగతికి పూడ్చ లేనటువంటి లోటును మిగిల్చింది. ఈ శోక ఘడియలో ఆయన ఆత్మీయులకు, ఆయనను అభిమానించే వారికి ఆ పరమాత్మ ధైర్యాన్ని ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓమ్ శాంతి.’’

 

***