శ్రీ లంక ప్రధాని శ్రీ మహిందా రాజపక్షె తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు. శ్రీ మహిందా రాజపక్షె తొలి సారి గా శ్రీ లంక పార్లమెంటు లో అడుగుపెట్టినప్పటి నుండి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆయన కు అభినందన లు తెలిపారు.
శ్రీ రాజపక్షె తన సుదీర్ఘ వృత్తిజీవనం లో శ్రీ లంక అభివృద్ధి కి అందించిన తోడ్పాటుల ను ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. అలాగే, రాబోయే కాలం లో కూడా శ్రీ రాజపక్షె రాణించాలి అనే అభిలాష ను శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
శ్రీ లంక లోని భారతీయ మూలాలు గల తమిళుల యొక్క ప్రముఖ నేతల లో ఒకరైన శ్రీ అరుముగన్ థోండామన్ నిన్నటి రోజు న అకస్మాత్తు గా కన్నుమూయడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారతదేశాని కి మరియు శ్రీ లంక కు మధ్య అభివృద్ధి ప్రధానమైన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు పోవడం లో శ్రీ థోండామన్ పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి జ్ఞాపకాని కి తెచ్చుకొన్నారు.
కోవిడ్-19 విశ్వమారి కారణం గా ఇరు దేశాల లో ఆరోగ్య రంగం పైన మరియు ఆర్థిక రంగం పైన ప్రసరించే ప్రతికూల ప్రభావాన్ని గురించి, మరి ఆ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకొంటున్న చర్యల ను గురించి నేత లు చర్చించారు. సవాళ్ల తో నిండిన ఈ కాలం లో శ్రీ లంక కు సాధ్యమైన అన్ని విధాలు గాను సాయపడేందుకు భారతదేశం సిద్ధం గా ఉంది అంటూ శ్రీ రాజపక్షె కు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.
Spoke to PM Mahinda Rajapaksa today to greet him on completing 50 years since his first election to the Parliament of Sri Lanka. Complimented him on an illustrious political career and wished him and the people of Sri Lanka good health, peace and prosperity. @PresRajapaksa
— Narendra Modi (@narendramodi) May 27, 2020