శ్రీ లంక అధ్యక్షుడు, శ్రేష్ఠుడు మాన్య శ్రీ మైత్రీపాలా సిరిసేన 2019వ సంవత్సరం మే నెల 30వ తేదీ నాడు జరిగిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పదవీ ప్రమాణస్వీకారోత్సవాని కి విచ్చేశారు.
ఈ రోజు న జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం లో, అధ్యక్షుడు శ్రీ సిరిసేన పాలుపంచుకొన్నారు. ఇటీవలే నిర్వహించిన సాధారణ ఎన్నికల లో ప్రధాన మంత్రి నాయకత్వం లోని పార్టీ ఘన విజయాన్ని సాధించిన అనంతరం శ్రీ మోదీ మరో మారు పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు అధ్యక్షుడు శ్రీ సిరిసేన ఆయన కు అభినందన లు తెలిపారు. మన ప్రాంతం లో శాంతి, సమృద్ధి, ఇంకా భద్రత ల కోసం రెండు దేశాల మధ్య సంబంధాల ను బలపరచుకొనేందుకు కలసి పని చేయాలని వుందంటూ శ్రీ సిరిసేన తన అభిలాష ను పునరుద్ఘాటించారు.
పదవీ ప్రమాణ స్వీకారోత్సవాని కి హాజరయినందుకు, మరి అలాగే తన యొక్క శుభాకాంక్షల ను తెలియ జేసినందుకు అధ్యక్షుడు శ్రీ సిరిసేన కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆత్మీయం గా ధన్యవాదాలు పలికారు. శ్రీ లంక తో స్నేహపూర్వకమైనటు వంటి ద్వైపాక్షిక సంబంధాల ను మరింతగా బలోపేతం చేసుకోవడం కోసం తన ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తుందని శ్రీ మోదీ వెల్లడించారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం మానవాళి కి ఒక బెదరింపు గా ఉంటూ వస్తున్నాయని ఉభయ నేతలు గుర్తు కు తెచ్చుకొన్నారు. దక్షిణ ఆసియా లోను, ఇంకా హిందూ మహాసముద్ర ప్రాంతం లోను శాంతి, భద్రత ల పరిరక్షణ కోసం మరింత సన్నిహితం గా సహకరించుకోవాలన్న వచనబద్ధత ను వారు ఇరువురూ వ్యక్తం చేశారు.
**