Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ లో భూమి పూజ ను నిర్వహించిన ప్రధాన మంత్రి పరస్పర ప్రేమ మరియు సౌభ్రాతృత్వం ల పునాది మీద మందిర నిర్మాణం జరగాలి: ప్రధాన మంత్రి


 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అయోధ్య లో ‘శ్రీ రామ జన్మభూమి మందిరం’ వద్ద భూమి పూజ ను నిర్వహించారు.
 

భారతదేశానికి ఒక భవ్యమైనటువంటి అధ్యాయం

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ యొక్క పావన తరుణం లో తోటి దేశ వాసుల కు మరియు ప్రపంచ వ్యాప్తం గా కల రామ భక్త జనుల కు అభినందనల ను వ్యక్తం చేశారు.  ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సందర్భం అని ఆయన పేర్కొంటూ భారతదేశం ఈ రోజు న ఒక భవ్యమైనటువంటి అధ్యాయాన్ని మొదలుపెడుతోందని, ఇది దేశవ్యాప్త ప్రజానీకం ఉత్తేజన శక్తి ని పొందిన ఘడియ, వారు శతాబ్దాల తరబడి వేచి ఉన్న దానిని ఎట్టకేల కు సాధించుకొన్నటువంటి సాఫల్యం, వారిలో అనేకులు వారి యొక్క జీవన కాలం లో నేడు చోటు చేసుకొంటున్న ఒక ఘటన కు సాక్షీభూతం గా నిలచారన్న సంగతి ని ఒక పట్టాన నమ్మలేకపోతున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  శిథిలం కావడం మరియు తిరిగి నిర్మాణానికి నోచుకోవడం అనేటటువంటి ఒక చక్రభ్రమణం నుండి రామ జన్మభూమి విముక్తం అయిందని, మరి డేరాల కు బదులు గా రాంలలా కు ప్రస్తుతం ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుందని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. 

దేశం అంతటా ప్రజలు స్వాతంత్ర్య సమరం దిశ గా ఒనరించిన త్యాగాల కు ఒక ప్రతినిధి గా ఆగస్టు 15వ తేదీ ఉన్న విధంగానే రామ మందిరం కోసం తరాల తరబడి చేస్తూ వచ్చిన సతత త్యాగాలు మరియు ఎనలేని సమర్పణ భావాల కు సూచకం గా ఈ దినం నిలచిపోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  రామ మందిరం అనే కల పండినందుకు ఆ క్రమం లో సంఘర్షణల ను సలిపినటువంటి వారందరిని ఆయన గుర్తుకు తెచ్చుకొంటూ వారికి వందనాన్ని ఆచరించారు. 

శ్రీ రాముడు – మన సంస్క్రుతి కి పునాది

శ్రీ రాముని యొక్క ఉనికి ని తుడిచివేయడం కోసం అనేక యత్నాలు జరిగినప్పటికీ, శ్రీ రాముడు మన సంస్కృతి కి ఒక పునాది గా ఉంటూ వచ్చారని ప్రధాన మంత్రి అన్నారు.  రామ మందిరం  మన సంస్కృతి కి, సనాతన  విశ్వాసానికి, జాతీయ భావన కు మరియు సామూహిక ఇచ్చా శక్తి కి ఒక ఆధునిక సంకేతం గా ఉంటుందని, ఇది రాబోయే తరాల కు ప్రేరణనిస్తూ ఉంటుందని ఆయన చెప్పారు.  దేవాలయ నిర్మాణం వివిధ రంగాల లో అనేక అవకాశాల ను కల్పించగలదని, తద్ద్వారా ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ను అది మార్చివేయగలుగుతుందని ఆయన అన్నారు. 

కోట్లాది రామ భక్తుల సంకల్పానికి మరియు విశ్వాస సంబంధిత యథార్థానికి ఒక నిదర్శనం గా ఈ దినం నిలచిపోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రతి ఒక్కరి భావాల ను గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం పరిగణన లోకి తీసుకొని గడచిన సంవత్సరం లో తీర్పు ను వెలువరించిన వేళ లో, తోటి దేశవాసులు సంయమనం తో, మర్యాద తో నడుచుకొన్న తీరు ను ఆయన ప్రశంసిస్తూ, ఈ రోజు న కూడాను అదే మాదిరి నిగ్రహం, ఇంకా గౌరవం వ్యక్తం అవుతూ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 

శ్రీ రాముని యొక్క విజయం, గోవర్ధన పర్వతాన్ని శ్రీ కృష్ణుడు గోటి తో ఎత్తి పట్టుకోవడం, ఛత్రపతి శివాజీ స్వరాజ్యాన్ని స్థాపించడం, గాంధీజీ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించడం ఇత్యాది  అనేక గొప్ప కార్యాల లో పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, ఆదివాసీ లు సహా అన్ని జీవన రంగాల కు చెందిన వారు వారి వంతు పాత్రల ను ఎలా పోషించారో ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.  అదే విధం గా, రామ మందిర నిర్మాణం సామాన్య పౌరుల యొక్క తోడ్పాటు తో, వారి సహాయం తో మొదలైందని ఆయన అన్నారు. 

శ్రీ రాముని గుణ స్వభావాల ను ప్రధాన మంత్రి మననం చేసుకొంటూ, శ్రీ రాముల వారు ఎల్లవేళ ల సత్యవ్రత దీక్ష పూనారని, ఇంకా సామాజిక సామరస్యాన్ని తన పాలన కు ఆధారభూతమైనటువంటి ఒక మూలస్తంభం గా నెలకొల్పారన్నారు.  శ్రీ రాముడు తన ప్రజల ను సమానమైన రీతి న ఆదరించారని, అయితే పేదలన్నా, ఆపన్నులన్నా ఆయన ప్రత్యేకమైన దయ ను చూపారన్నారు.  శ్రీ రాముడు ఒక స్ఫూర్తి గా కానగ రాని జీవన కోణమంటూ ఏ ఒక్కటయినా లేదు, మరి దేశం యొక్క సంప్రదాయం, విశ్వాసం, దర్శనం, సంస్కృతి ల తాలూకు పలు పార్శ్వాల లో ఆయన ప్రభావం సాక్షీభూతం గా నిలుస్తూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు.  

శ్రీ రాముడు – భిన్నత్వం లో ఏకత్వానికి సూత్రం

పురాతన కాలం లో వాల్మీకి రామాయణం ద్వారా, మధ్యయుగ కాలం లో తులసీదాస్, కబీర్ మరియు గురునానక్ ల ద్వారా శ్రీ రాముడు ప్రజల కు దారి ని చూపేటటువంటి కాంతి లాగా వ్యవహరించారని, అదేవిధం గా ఆధునిక కాలం లో మహాత్మ గాంధీ భజనల లో అహింస, సత్యాగ్రహ శక్తి వనరు లాగా కూడా శ్రీ రాముడు ఉన్నారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  బుద్ధ భగవానుడు కూడా శ్రీ రాముని తో స్ఫూర్తి సంబంధం కలిగి ఉన్నారని, అయోధ్య నగరం శతాబ్దాల నుండి జైనుల యొక్క విశ్వాస కేంద్రం గా ఉందని ఆయన వివరించారు.  వివిధ భాషల లో వ్రాయబడిన అనేకానేక రామాయణాల ను గురించి ప్రధాన మంత్రి తెలియజేస్తూ, దేశం లో భిన్నత్వం లో ఏకత్వానికి శ్రీ రాముడు ఒక సూత్రం వలె నిలిచినట్లు పేర్కొన్నారు. 

శ్రీ రాముడు అనేక దేశాల లో గౌరవించబడినట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.  అత్యధిక ముస్లిమ్ జనాభా కల ఇండోనేశియా వంటి దేశాల లో ప్రాచుర్యం పొందిన రామాయణాల జాబితా ను ఆయన తెలియజేశారు.  కంబోడియా, లావోస్, మలేశియా, థాయిలాండ్, శ్రీ లంక, నేపాల్ లతో పాటు ఇరాన్ లో కూడా శ్రీ రాముని కి సంబంధించిన ప్రస్తావన లు ప్రచారం లో ఉన్నాయని, రామ కథ లు అనేక దేశాల లో ప్రసిద్ధి చెందాయని ప్రధాన మంత్రి వివరించారు.  రామ మందిరం నిర్మాణం ప్రారంభం కావడం తో ఈ దేశాలన్నిటి లో ప్రజలు ఈ రోజు న తప్పక సంతోషం గా ఉండి ఉంటారు అని ఆయన పేర్కొన్నారు.  

యావత్తు మానవ జాతి కి ప్రేరణ

ఈ దేవాలయం రాబోయే యుగాలలో యావత్తు మానవాళి కి ఒక ప్రేరణ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.  శ్రీ రాముడు , రామ మందిరం, ఇంకా మన యుగాల నాటి సంప్రదాయం ఇచ్చిన సందేశం యావత్తు ప్రపంచానికి చేరుతూ ఉండడం చాలా ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు.  దీనిని  దృష్టి లో పెట్టుకొనే, దేశం లో రామ్ సర్క్యూట్ ను రూపొందించడం జరుగుతోందన్నారు. 

రామ రాజ్యం

మహాత్మ గాంధీ కలలు గన్న రామరాజ్యం యొక్క రూపురేఖల ను ప్రధాన మంత్రి వివరించారు.  దేశాని కి మార్గనిర్దేశం చేస్తూ కొనసాగుతున్న శ్రీ రాముని ఆశయాల ను గురించి ఆయన వివరించారు.  వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి:   

ఎవరూ పేద గా లేదా విచారం గా  ఉండకూడదు;  పురుషులు, మహిళలు సమానం గా సంతోషం గా ఉండాలి.  రైతులు, జంతు సంరక్షకులు ఎల్లప్పుడూ సంతోషం గా ఉండాలి;  చిన్న పిల్లలు, వృద్దులు, వైద్యులు ఎల్లప్పుడూ రక్షించబడాలి;  ఆశ్రయాన్ని కోరుకొనే వారిని రక్షించడం మనందరి కర్తవ్యం;  మాతృభూమి స్వర్గం కంటే మిన్న;  ఒక దేశాని కి ఎంత ఎక్కువ శక్తి ఉంటే ఆ దేశం లో శాంతి కి అంత ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. 

శ్రీ రాముడు ఆధునికత తో పాటు మార్పునకు కూడా ప్రతీక అని  ప్రధాన మంత్రి అన్నారు. దేశం  శ్రీ రాముని యొక్క ఈ ఆదర్శాల ను అనుసరించే అభివృద్ధి చెందుతోంది అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 

పరస్పర ప్రేమకు మరియు సోదరత్వానికి పునాది

పరస్పర ప్రేమ, ఇంకా సోదరభావం అనే పునాది మీద ఈ ఆలయాన్ని నిర్మించాలి అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.  ‘సబ్ కా సాథ్’, ‘సబ్ కా విశ్వాస్’ ల ద్వారా మనం ‘సబ్ కా వికాస్’ ను సాధించి, ఆత్మవిశ్వాసభరితమైనటువంటి మరియు స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించుకోవలసిన ఆవశ్యకత ఉంది అని ఆయన అన్నారు.  ఎటువంటి జాప్యానికి తావు ఉండరాదని, మరి మనం ముందుకు సాగిపోవాలని శ్రీ రాముల వారు ఇచ్చిన సందేశమే దేశం అనుసరించితీరవలసిన సందేశం అని ఆయన ఆయన నొక్కిచెప్పారు.

కోవిడ్ కాలం లో ‘మర్యాద’ అంటే అదీ

శ్రీ రాముని  ‘మర్యాద’ మార్గం యొక్క ప్రాముఖ్యాన్ని కోవిడ్ పరిస్థితి నేపథ్యం లో ప్రధాన మంత్రి గుర్తుచేసి తన ప్రసంగాన్ని ముగించారు.  ‘‘దో గజ్ కీ దూరీ – మాస్క్ హైఁ జరూరీ’’ ( ఈ మాటల కు.. ఒక మనిషి కి మరొక మనిషి కి నడుమ న రెండు గజాల ఎడం ను పాటించాలి, ఇంకా మాస్క్ ధరించడం అవసరం.. అని భావం) అనేదే ప్రస్తుత పరిస్థితి తాలూకు అభ్యర్థన అని ఆయన చెప్తూ, దీనిని ప్రతి ఒక్కరు పాలించాలి అంటూ ఉద్బోధించారు.
 

**