Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ రతన్ టాటా మృతికి ప్రధానమంత్రి సంతాపం విద్య, వైద్యం, పారిశుధ్యం, జంతు సంక్షేమం వంటి వాటిల్లో ఆయన ముందు వరుసలో నిలబడ్డారు: ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారుటాటా ఒక దార్శనిక వ్యాపార రంగ నాయకుడుదయగల మనస్సున్న అసాధారణమైన వ్యక్తి అని..వినయందయసమాజాన్ని బాగు చేయాలనే అచంచలమైన నిబద్ధతతో ఎంతో మందికి దగ్గరయ్యారని మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఈ విధంగా పేర్కొన్నారు:

‘‘రతన్ టాటా గారు దార్శనిక వ్యాపారవేత్తదయగల మనస్సున్న అసాధారణ వ్యక్తిభారతదేశంలో చాలా కాలం నుంచి ఉన్న అత్యంత ప్రతిష్ఠాత్మక వ్యాపార సంస్థలలో ఒక దానికి ఆయన స్థిరమైన నాయకత్వాన్ని అందించారుఅదే సమయంలో ఆయన సహాయ సహకారాల పరిధి బోర్డురూమ్‌ను దాటిపోయిందివినయందయసమాజాన్ని బాగు చేయాలనే అచంచలమైన నిబద్ధతతో ఆయన ఎంతో మంది అభిమానానికి పాత్రుడయ్యారు.

” పెద్ద కలలు కనడంసమాజానికి తనవంతుగా తిరిగి ఇచ్చే విషయంలో ఆయన అభిరుచి అనేవి రతన్ టాటా గారికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన అంశాల్లో ఒకటివిద్యవైద్యంపారిశుద్ధ్యంజంతు సంక్షేమం వంటి అంశాలపై పని చేసే వారిలో ఆయన ముందు వరుసలో ఉన్నారు”.

రతన్ టాటా గారితో పంచుకున్న క్షణాలతో నా మనసు నిండిపోయిందినేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో ఆయనను తరచూ కలిసేవాడినివివిధ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకునేవాళ్లంవివిధ అంశాలపై టాటా దృక్పథం గొప్పగా ఉండేదినేను దిల్లీకి వచ్చినప్పుడు కూడా మా పరిచయం కొనసాగిందిఆయన మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానుఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికీస్నేహితులకూఅభిమానులకూ నా సానుభూతిని తెలుపుతున్నానుఓం శాంతి

 

***

MJPS/SR