Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ భవానీ సింహ్ జీ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ భవానీ సింహ్ జీ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ బిజెపి సహ్- సంఘటన్ మహామంత్రి శ్రీ భవానీ సింహ్ గారి మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఒక ట్వీట్ లో అత్యంత దు:ఖాన్ని వ్యక్తం చేశారు.  శ్రీ భవానీ సింహ్ గారి వినమ్ర వ్యక్తిత్వాన్ని, కష్టించి పనిచేసే తత్వాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకొన్నారు.  సంస్థ కు శ్రీ భవానీ సింహ్ జీ అందించిన తోడ్పాటు ను, ప్రజా సేవ లో ఆయన ప్రయాసల ను కూడా ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు.  దివంగత ఆత్మ కు  ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక అంటూ శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

***