Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బ‌ల‌రాజ్ మ‌ధోక్ మృతికి ప్ర‌ధాన మంత్రి సంతాపం


శ్రీ బ‌ల‌రాజ్ మ‌ధోక్ మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ” బ‌ల‌రాజ్ మ‌ధోక్ జీ ఆద‌ర్శాల‌కు క‌ట్టుబ‌డిన తీరు ఎంతో దృఢమైన‌టువంటిది. ఆయ‌న ఆలోచ‌న‌ల‌లో అమిత స్ప‌ష్ట‌త ఉండేది. దేశానికి మ‌రియు స‌మాజానికి అంకిత‌మైన నిస్వార్థ వ్య‌క్తి ఆయ‌న‌.

అనేక సంద‌ర్భాల‌లో బ‌ల‌రాజ్ మ‌ధోక్ గారిని క‌లసి, ఆయనతో మాట్లాడే భాగ్యం నాకు ద‌క్కింది. ఆయ‌న మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం ఎంతో విచార‌క‌రం. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం తెలియజేస్తున్నాను. ఆయ‌న ఆత్మకు శాంతి ల‌భించు గాక ” అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

***