Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బిల్ గేట్స్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించడం తో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


శ్రీ బిల్ గేట్స్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించడాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందించారు. రాబోయే కాలాల్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని సందర్శించండంటూ ప్రపంచవ్యాప్త ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఒక ఇంజినీరింగ్ అద్భుతం అని, కీర్తి శేషుడు శ్రీ సర్ దార్ పటేల్ గారి కి అర్పించినటువంటి ఒక గొప్ప ప్రశంస అని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని సందర్శించిన తరువాత శ్రీ బిల్ గేట్స్ ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో వ్యాఖ్యానించారు. ఆ విగ్రహం స్థానిక ఆదివాసి సముదాయానికి, ప్రత్యేకించి మహిళలకు ఆర్థిక పరమైన అవకాశాన్ని అందజేస్తున్నందుకు తాను సంతోషిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

శ్రీ బిల్ గేట్స్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశాని కి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యుత్తరాన్ని ఇస్తూ –

‘‘ఈ అభిప్రాయాన్ని గమనించడం సంతోషం గా ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పరిసరాల లో మీకు కలిగిన అనుభూతి ని మీరు ఆస్వాదించినందుకు ఆనందం గా ఉంది. రాబోయే కాలాల్లో ఈ విగ్రహాన్ని సందర్శించండంటూ ప్రపంచవ్యాప్త ప్రజల ను కూడా నేను కోరుతున్నాను. @BillGates’’ అని పేర్కొన్నారు.