Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బిల్ గేట్స్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


బిల్ ఎండ్ మిలిండా గేట్స్ ఫౌండేశన్ కో- చైర్ శ్రీ బిల్ గేట్స్ మూడు రోజుల పాటు భార‌త‌దేశ సంద‌ర్శ‌న కార్య‌క్ర‌మం లో భాగం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ గేట్స్ తో ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు. గడచిన సెప్టెంబ‌ర్ లో న్యూ యార్క్ లో ఐక్య రాజ్య స‌మితి సాధార‌ణ స‌భ సమావేశం జరిగిన సందర్భం లో కూడా వీరు ఉభ‌యులు సమావేశమయ్యారు.

స్థిర అభివృద్ధి ల‌క్ష్యాల (ఎస్‌డిజి) సాధన దిశ గా భార‌త ప్ర‌భుత్వ కృషి లో, మరీ ముఖ్యం గా వ్య‌వ‌సాయం, పారిశుధ్యం, పోష‌ణ విజ్ఞానం మ‌రియు ఆరోగ్యం రంగాల లో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కు మద్దతు ను అందించాలన్నది త‌మ ఫౌండేశ‌న్ వచన బద్ధత అని శ్రీ బిల్ గేట్స్ మరో మారు స్పష్టం చేశారు.

పోషణ సంబంధ విజ్ఞానాన్ని కీలక శ్రద్ధ అవసరమైనటువంటి రంగం గా ప్రాధాన్యం కట్టబెట్టడం తో పాటు జాతీయ పోష‌ణ్ అభియాన్ లో భాగం గా సలుపుతున్నటువంటి కృషి కి గాను శ్రీ గేట్స్ ప్ర‌ధాన మంత్రి ని అభినందించారు.

వ్య‌వ‌సాయ దిగుబడి ని మరియు వ్యవస్థ లను పెంపొందింప చేయ‌గ‌ల నూత‌న ఆలోచ‌న‌ల ను- మరీ ముఖ్యం గా వ్య‌వ‌సాయాన్ని మ‌రింత మంది కి అందుబాటులోకి తీసుకురావడం, తద్వారా పేద‌ ప్రజ అభ్యున్నతి కి మ‌రియు ఆద‌ర‌ణ కు నోచుకోని వ‌ర్గాల అభ్యున్న‌తి కి తోడ్ప‌డ‌గలిగే ఆలోచనల ను – ఆయ‌న ప్ర‌ధాన మంత్రి దృష్టి కి తీసుకు వ‌చ్చారు.

ఫౌండేశ‌న్ యొక్క కృషి ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌శంసిస్తూ, ఈ ఫౌండేశ‌న్ క‌న‌బ‌రుస్తున్న ప్ర‌తిస్పంద‌న శీల‌త్వాన్ని మరియు ప్రావీణ్యాన్ని ప్ర‌భుత్వం ఎంత విలువైంది గా ప‌రిగ‌ణిస్తోందో ప్ర‌త్యేకం గా ప్రస్తావించారు. స‌మాచార రాశి మరియు నిద‌ర్శ‌నాలపై ఆధారపడే ఆలోచనల తో కూడినటువంటి చొర‌వల తో పాటు అభివృద్ధి లో భాగ‌స్తులుగా ఉన్నటువంటి వర్గాలు అందించే మ‌ద్ధ‌తు లు వ్య‌వ‌సాయం, హ‌రిత శ‌క్తి , పోష‌ణ విజ్ఞానం మ‌రియు ఆరోగ్యం రంగాల లో చేప‌డుతున్న ప‌నుల ను వేగ‌వంతం చేయడంలో సహాయకారి కాగలవు అని ఆయ‌న సూచించారు.

శ్రీ బిల్ గేట్స్ పక్షాన భార‌త‌దేశం లో నాయకత్వ స్థానాల లో ఉన్న వారు కూడా ఈ స‌మావేశం లో పాల్గొన్నారు.

**