Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ బంగారు ఆదిగళర్ జీ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


శ్రీ బంగారు ఆదిగళర్ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన సందేశాల లో –

‘‘శ్రీ బంగారు ఆదిగళర్ జీ ఇక లేరని తెలిసి తీవ్ర దు:ఖానికి లోనయ్యాను. దయ తో మరియు ఆధ్యాత్మికత్వం తో సమృద్ధం అయినటువంటి ఆయన యొక్క జీవనం ఎంతో మంది కి దారి ని చూపే దీపం లా ఉంటుంది. మానవ జాతి కి అలుపెరుగక సేవ చేయడం ద్వారాను, విద్య కు పెద్ద పీట వేయడం ద్వారాను ఆయన ఎందరి జీవితాల లోనో జ్ఞానం, ఇంకా ఆశ ల యొక్క విత్తుల ను చల్లారు. ఆయన యొక్క కార్యాలు తరాల తరబడి మార్గదర్శకత్వాన్ని మరియు ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే నా యొక్క సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.