Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఫిడెల్ కాస్త్రో మరణం పట్ల ప్రధాన మంత్రి సంతాపం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క్యూబా నేత శ్రీ ఫిడెల్ కాస్త్రో దు:ఖదాయక మరణం పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

“శ్రీ ఫిడెల్ కాస్త్రో దు:ఖదాయక మరణం పట్ల క్యూబా ప్రభుత్వానికి మరియు క్యూబా ప్రజలకు నేను నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఆత్మకు ప్రశాంతి లభించు గాక.

మేము ఈ విషాద ఘడియలలో క్యూబా ప్రభుత్వానికి, క్యూబా ప్రజలకు వెన్నంటి నిలుస్తాము.

శ్రీ ఫిడెల్ కాస్త్రో 20వ శతాబ్దపు అత్యంత విశిష్టమైన వ్యక్తులలో ఒకరు. ఒక గొప్ప స్నేహితుడిని కోల్పోయి భారతదేశం శోకగ్రస్తురాలు అయింది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.