Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ప్రణబ్ ముఖర్జీతో నా అనుబంధాన్ని నేను ఎప్పటికీ నా మనసులో పదిలపరచుకొంటాను: ప్రధానమంత్రి


శ్రీ ప్రణబ్ ముఖర్జీతో తన అనుబంధాన్ని తాను ఎప్పటికీ తన మనసులో పదిలంగా అట్టిపెట్టుకొంటానని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అన్నారు.  శ్రీ ప్రణబ్ ముఖర్జీతో తాను మాటామంతీ జరిపిన సందర్భాలకు చెందిన అనేక జ్ఞాపకాలను మరోసారి ముందుకు తెచ్చినందుకు శర్మిష్ఠ ముఖర్జీ గారికి శ్రీ  మోదీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీ ముఖర్జీకి ఉన్న లోతైన అవగాహన, జ్ఞానం సాటిలేనివంటూ శ్రీ మోదీ ప్రశంసించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మోదీ స్టోరీ హ్యాండిల్ ద్వారా పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధాని స్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘ప్రణబ్ బాబుతో నా సంభాషణల జ్ఞాపకాలను ఎన్నిటినో మరోసారి గుర్తుచేసినందుకు శర్మిష్ఠ గారికి నా ధన్యవాదాలు. నేను ఆయనతో నాకున్న అనుబంధాన్ని  ఎప్పటికీ నా మనసులో పదిలపరచుకొంటాను.  ఆయనకు ఉన్న జ్ఞానం, లోతైన ఆలోచనలు సాటిలేనివి.

@Sharmistha_GK”.

 

 

***

MJPS/SR