Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి


శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , ఆయనకు ఘనంగానివాళులర్పించారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ఒక సందేశమిస్తూ,‘‘
సంఘసంస్కర్త, జ్ఞానతేజం,శ్రీ నారాయణగురు జయంతి సందర్భంగా వారికి నివాళి. నిరుపేదల అభ్యున్నతికి వారు కృషిచేశారు.
వారి మేధస్సుతో సమాజ రూపురేఖలు మార్చారు. సామాజిక న్యాయం, ఐక్యత విషయంలో వారు చూపిన తిరుగులేని అంకితభావం మనకు ఎల్లవేళలా ప్రేరణనిస్తుంది.
గతంలో నేను శివగిరి మఠాన్ని సందర్శించిన ఫోటోలను షేర్ చేస్తున్నాను”అని ప్రధానమంత్రి తనసందేశంలో పేర్కొన్నారు.