Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ నాడప్రభు కెంపెగౌడ యొక్క 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని బెంగళూరు లో ఆవిష్కరించిన ప్రధాన మంత్రి

శ్రీ నాడప్రభు కెంపెగౌడ యొక్క 108 అడుగుల ఎత్తయిన కంచు విగ్రహాన్ని బెంగళూరు లో ఆవిష్కరించిన ప్రధాన మంత్రి


నాడప్రభు శ్రీ కెంపెగౌడ యొక్క 108 అడుగుల ఎత్తు  కాంస్య విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  బెంగళూరు లో ఈ రోజు న ఆవిష్కరించారు.  విగ్రహాని కి ప్రధాన మంత్రి పుష్పాంజలి తో పాటు పవిత్ర జలాన్ని కూడా సమర్పించారు.  ఈ సందర్భం లో ఒక మొక్క ను కూడా ప్రధాన మంత్రి నాటారు.

బెంగళూరు యొక్క వృద్ధి కి బెంగళూరు నగరం యొక్క సంస్థాపకుడు అయిన నాడప్రభు కెంపెగౌడ గారు అందించిన తోడ్పాటు ను స్మరించుకోవడం కోసం ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది.  ‘‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’’ తో పేరు తెచ్చుకొన్న శ్రీ రామ్ వి. సుతార్ ఆధ్వర్యం లో రూపుదిద్దుకొన్న ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడానికి 98 టన్నుల కంచు ను మరియు 120 టన్నుల ఉక్కు ను ఉపయోగించడమైంది.      

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 “బెంగళూరు ను తీర్చిదిద్దడం లో శ్రీ నాడప్రభు కెంపెగౌడ యొక్క పాత్ర సాటిలేనటువంటిది గా ఉంది.  మరే ఇతర అంశాల కంటే ప్రజల సంక్షేమాన్నే సదా మిన్న గా నిలిపినటువంటి ఒక దార్శనికుని గా ఆయన ను స్మరించుకోవడం జరుగుతున్నది.  ‘స్టాచ్యూ ఆఫ్ ప్రాస్ పెరిటి’ ని బెంగళూరు లో ప్రారంభించడం నాకు దక్కిన గౌరవం గా అనిపిస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

ప్రధాన మంత్రి వెంట కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై మరియు కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ మరియు కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోశి తదితరులు ఉన్నారు.