Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం


శ్రీ దరిపల్లి రామయ్య మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారులక్షలాది చెట్లను నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చిరస్మరణీయులని ప్రశంసించారు.

 ‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్ లో ఆయన ఇలా పేర్కొన్నారు:

 “దరిపల్లి రామయ్య గారు సుస్థిరత ప్రయత్నాలకు నాయకత్వం వహించిన మార్గదర్శిగా చిరస్మరణీయులుఆయన లక్షలాది మొక్కలు నాటి.. వాటి పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారుప్రకృతి పట్ల న చేసిన అవిశ్రాంత కృషితనకు గల మక్కువ.. భావి తరాల సంరక్షణ పట్ల ఆయన బాధ్యతకు నిదర్శనంమన భూమిని పచ్చదనంతో నింపే ప్రయత్నంలో మన యువతకు సదా స్ఫూర్తినిస్తుంటారుఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికిఅభిమానులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నానుఓం శాంతి