Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలోని జపాన్ వాణిజ్య ప్రతినిధివర్గంతో ప్రధానమంత్రి భేటీ


శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలోని జపాన్ వాణిజ్య ప్రతినిధివర్గంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. భారతదేశంలో వారి విస్తరణ ప్రణాళికలను, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ విషయంలో దృఢ నిబద్ధతను తెలుసుకొని తనలో ఉత్సాహం కలిగిందని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ తాత్సువో యాసునాగా నాయకత్వంలో జపాన్ ప్రతినిధివర్గంతో భేటీ అయినందుకు సంతోషిస్తున్నాను. భారత్‌లో వారి విస్తరణ ప్రణాళికలు, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ విషయంలో దృఢ నిబద్ధత ఉత్సాహాన్ని రేకెత్తించాయి. జపాన్‌తో మన ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని గాఢతరంగా మలచుకోవాలని నేను ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.’’

 

***