Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ జ‌గ‌దీశ్ ఠ‌క్క‌ర్ మృతి కి సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం (పిఎంఒ)లో పిఆర్ఒ శ్రీ జ‌గ‌దీశ్ ఠ‌క్క‌ర్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“పిఎంఒ లో ప్రజా సంబంధాల అధికారి (పిఆర్ఒ)గా విధులు నిర్వర్తించిన శ్రీ జ‌గ‌దీశ్ ఠ‌క్క‌ర్ మ‌ర‌ణం నాకు అత్యంత దుఃఖాన్ని క‌లిగించింది. జ‌గ‌దీశ్ భాయ్ ఒక చిర‌కాలానుభ‌వం క‌లిగిన ప‌త్రికార‌చ‌యిత‌. ఆయ‌న‌ తో కలసి గుజ‌రాత్ లోను, ఢిల్లీ లోను ప‌ని చేసే భాగ్యం నాకు ద‌క్కింది. సీదాసాదా గా ఉండే ఆయన స్వ‌భావ రీత్యా స్నేహశీలి.

ఎంతో మంది ప‌త్రికా ర‌చ‌యిత‌లు జ‌గ‌దీశ్ భాయ్ తో గత కొన్నేళ్లు గా క్ర‌మం త‌ప్ప‌క సంప్ర‌దింపులు జ‌రిపారు. ఇంత‌కు ముందు గుజ‌రాత్ లో ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌ కు ఆయ‌న తన సేవ‌లను అందించారు. పని ని ప్రేమించిన‌టువంటి మ‌రియు విధుల‌ను అమిత శ్రద్ధ తో నెర‌వేర్చిన‌టువంటి ఒక అద్భుత‌మైన వ్యక్తి ని మ‌నం కోల్పోయాం. ఆయ‌న కుటుంబానికి మ‌రియు శ్రేయోభిలాషుల‌కు ఇదే నా సంతాపం” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.