Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదాన దినం సందర్భంగా ఆయనకు ప్రణామాలర్పించిన ప్రధానమంత్రి


శ్రీ గురు తేగ్ బహదూర్ బలిదాన దినాన్ని సంస్మరిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువుకు నివాళులర్పించారు. న్యాయం, సమానత్వం, మానవాళి సంక్షేమం కోసం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రాణ త్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ త్యాగాన్ని ఈ సందర్భంగా ప్రధాని స్మరించుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో  ప్రధాని పంచుకున్ననివాళి సందేశం:  

“న్యాయం, సమానత్వం వంటి ఆదర్శాల కోసం, మానవాళి సంక్షేమం కోసం అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించి ప్రాణ త్యాగం చేసిన గురు తేగ్ బహదూర్ త్యాగాన్ని ఆయన అమరులైన బలిదాన దినం నాడు స్మరించుకుంటున్నాం. కష్టాలు ఎదురైనప్పటికీ వాటికి తలవంచక స్థిరంగా నిలవాలనీ, తోటి మానవులకు నిస్వార్థంగా సేవ చేయాలని  ఆయన బోధనలు మనకు తెలియజేస్తున్నాయి.  ఐక్యత, సౌభ్రాతృత్వ భావనలు కలిగి ఉండేందుకు శ్రీ తేగ్ బహదూర్ బోధనలు మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి” అని ప్రధాని పేర్కొన్నారు.