Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గురునానక్ దేవ్ ‘గురుపర్వ్’ వేడుకల్లో భాగంగా గుజరాత్‌లోని లఖ్‌పత్ సాహిబ్ గురుద్వారాలో ప్రధానమంత్రి ప్రసంగం

శ్రీ గురునానక్ దేవ్ ‘గురుపర్వ్’ వేడుకల్లో భాగంగా గుజరాత్‌లోని లఖ్‌పత్ సాహిబ్ గురుద్వారాలో ప్రధానమంత్రి ప్రసంగం


   శ్రీ గురునానక్ దేవ్ గురుపర్వ్‌ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాత్‌లోని లఖ్‌పత్ సాహిబ్ గురుద్వారాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ- కాలప్రవాహంలో ప్రతి మలుపునకూ లఖ్‌పత్ సాహిబ్ గురుద్వారా సజీవ సాక్షిగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. గతంలో లఖ్‌పత్‌ సాహిబ్‌ ఎన్ని ఒడుదొడుకులను  చూసిందో తనకింకా గుర్తుందని ఆయన అన్నారు. ఒకనాడు విదేశాలకు వెళ్లాలంటే ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదని గుర్తుచేశారు. లోగడ 2001నాటి భూకంపం తర్వాత గురువు అనుగ్రహంతో ఈ పవిత్ర ప్రాంగణానికి సేవ చేసే అవకాశం తనకు లభించిందని ప్రధాని పేర్కొన్నారు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు ఇక్కడి వాస్తవ వైభవ పునరుద్ధరణకు ఎంతగా శ్రమించారో నేటికీ తన కళ్లకు కడుతున్నదని చెప్పారు. పురాతన రాత శైలితో ఇక్కడి గోడలపై ‘గురువాణి’ని చెక్కారని తెలిపారు. అందుకే ఈ ప్రాజెక్టును యునెస్కో కూడా ఆనాడు గౌరవించిందని గుర్తుచేశారు.

PM India

   మాననీయ గురు సాహిబ్ల ఆశీస్సులతోనే ప్రభుత్వం శ్రీ గురుగోవింద్ సింగ్ 350వ ‘ప్రకాష్ పర్వ్’.. శ్రీ గురునానక్ దేవ్ 550వ ‘ప్రకాష్ పర్వ్’ను.. శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ ‘ప్రకాష్ ఉత్సవ్’వంటి పవిత్ర వేడుకలను నిర్వహించగలిగే స్థితిలో ఉందని ప్రధానమంత్రి అన్నారు. శ్రీ గురునానక్ దేవ్ సందేశం సరికొత్త శక్తితో ప్రపంచమంతటికీ చేరేవిధంగా ఇటీవలి సంవత్సరాల్లో ప్రతి స్థాయిలోనూ కృషి కొనసాగుతున్నదని ప్రధాని చెప్పారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తూ వచ్చిన కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రభుత్వం 2019లో పూర్తి చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుతం శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ ‘ప్రకాష్ ఉత్సవ్’ నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

   పూజనీయ ‘గురు గ్రంథ్ సాహిబ్’ ‘అసలు ప్రతి’ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌ చేర్చడంలో ఇటీవలే విజయం సాధించామని ప్రధానమంత్రి అన్నారు. గురు కృపకు ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరేమిటంటూ ప్రధాని ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. కొన్ని నెలల కిందట తాను అమెరికా వెళ్లినప్పుడు 150కిపైగా చారిత్రక వస్తువులను అమెరికా భారత్‌కు తిరిగి అందజేసిందని చెప్పారు. వీటిలో ‘పెష్కబ్జ్’ లేదా చిన్న కత్తి కూడా ఉందని, దానిపై శ్రీ గురు హరగోవింద్ పేరు పర్షియన్ భాషలో చెక్కబడి ఉందని ఆయన చెప్పారు. “ఇదంతా చేయగలగడం ఈ ప్రభుత్వానికి లభించిన గొప్ప అదృష్టం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ‘ఖల్సా పంథ్‌’ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ‘పాంచ్‌ ప్యారే’లోని నాలుగో సిక్కు గురువు శ్రీ భాయ్ మోఖం సింగ్ గుజరాత్‌ వాస్తవ్యులు కావడం ఈ రాష్ట్రానికి సదా గర్వకారణమని ప్రధాని వ్యాఖ్యానించారు. దేవభూమి ద్వారకలో ఆయన జ్ఞాపకార్థం ‘బేత్‌ ద్వారకా భాయ్ మోఖం సింగ్’ గురుద్వారా నిర్మించబడిందని తెలిపారు.

   దురాక్రమణదారుల దండయాత్రలు, దమనకాండ సమయంలో భారత సమాజానికి ఘనమైన గురు పరంపర సంప్రదాయం అందించిన సహకారాన్ని ప్రధానమంత్రి సగౌరవంగా గుర్తుచేసుకున్నారు. ఆనాడు సమాజం ఛాందసత్వం, చీలికలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు శ్రీ గురునానక్ దేవ్ సోదరభావ సందేశంతో ముందుకొచ్చారని ఆయన అన్నారు. అదేవిధంగా శ్రీ గురు అర్జన్ దేవ్ దేశంలోని సాధువుల గళాన్ని ఏకీకృతం చేయడం ద్వారా దేశవ్యాప్తంగా  ఐక్యతా భావనను ప్రోదిచేశారన్నారు. శ్రీ గురు హరికిషన్ మానవాళికి సేవా మార్గాన్ని చూపించారని, ఇది నేటికీ సిక్కులకేగాక మిగిలిన మానవాళికీ మార్గదర్శకంగా ఉందని చెప్పారు. శ్రీ గురునానక్ దేవ్, ఆయన తర్వాత మన పలువురు గురువులు భారత్‌లో చైతన్యం రగిలించడంతోపాటు దేశాన్ని సురక్షితంగా ఉంచే మార్గాన్ని రూపొందించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మన గురువుల సేవలు సమాజానికి, ఆధ్యాత్మికతకు మాత్రమే పరిమితం కావన్నారు. మన దేశం.. జాతి చింతన.. విశ్వాసం.. సమగ్రతలు నేడు సురక్షితంగా ఉన్నాయంటే- సిక్కు గురువుల గొప్ప ‘తపస్సు’ అందుకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. బాబర్ దండయాత్రతో భారతదేశానికి వాటిల్లే ముప్పు గురించి శ్రీ గురునానక్ దేవ్‌కు స్పష్టమైన అవగాహన ఉందని ప్రధానమంత్రి చెప్పారు.

   శ్రీ గురు తేగ్ బహదూర్ జీవితం ‘దేశమే ప్రథమం’ అనే భావనకు తిరుగులేని నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. మానవాళి శ్రేయస్సుకు గురు తేగ్‌ బహదూర్‌ సదా కట్టుబడి ఉన్నారని, భారతీయ ఆత్మ దార్శనికత ఆయన నుంచే మనకు లభించిందని చెప్పారు. దేశం ఆయనను ‘హింద్‌ కీ ఛాదర్‌’ బిరుదంతో సత్కరించడమే సిక్కు సంప్రదాయాలపట్ల ప్రతి భారతీయునికీగల ఆత్మీయ బంధానికి రుజువని పేర్కొన్నారు. ఉగ్రవాదం.. మతోన్మాదంపై దేశం పోరాడుతున్న తీరును గురు తేగ్ బహదూర్ శౌర్యం.. ఔరంగజేబుతో యుద్ధంలో ఆయన త్యాగం మనకు బోధిస్తాయన్నారు. అలాగే గురువు శ్రీ గోవింద్‌ సింగ్‌ సాహిబ్‌ జీవితం కూడా ప్రతి అడుగులోనూ పట్టుదల, త్యాగాలకు సజీవ ఉదాహరణగా ఆయన అన్నారు. బ్రిటిష్ పాలన కాలంలోనూ మన సిక్కు సోదర-సోదరీమణులు దేశ స్వాతంత్ర్యం కోసం మొక్కవోని పరాక్రమంతో పోరాడారాని చెప్పారు. ఇదేకాకుండా మన స్వాతంత్ర్య పోరాటంతోపాటు జలియన్ వాలాబాగ్ గడ్డ కూడా వారి త్యాగాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని ప్రధానమంత్రి ప్రశంసించారు. మనం గతాన్ని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందుతున్న నేపథ్యంలో ఈ సంప్రదాయం నేటికీ సజీవంగా ఉందని, ప్రస్తుత ‘అమృత్ మహోత్సవ్’ కాలంలో ఇది మరింత కీలకం కాగలదని ప్రధాని అన్నారు.

   శ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు.. కచ్‌ నుంచి కోహిమా దాకా దేశమంతా కలలు కంటూ వాటి సాఫల్యం కోసం సమష్టిగా పాటుపడుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఒకే భారతం-శ్రేష్ట భారతం అన్నదే నేడు దేశానికి తారకమంత్రమని ఆయన గుర్తుచేశారు. ‘సమర్థ నవ భారతం పునరుజ్జీవనమే’ నేటి మన లక్ష్యమని, ‘ప్రతి పేదకూ సేవ.. ప్రతి అణగారిన వ్యక్తికీ ప్రాధాన్యమే ఇవాళ దేశం అనుసరించే విధానమని పునరుద్ఘాటించారు. కచ్‌లో ‘రాన్ వేడుకలు’ సందర్శించాల్సిందిగా భక్తులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. కచ్ పరివర్తన అక్కడి ప్రజల దార్శనికతకు, కఠోర కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. ఇవాళ శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఆయనకు నివాళి అర్పించారు. కచ్ ప్రాంతంపై శ్రీ వాజ్‌పేయికిగల ప్రేమాభిమానాలను గుర్తు చేసుకున్నారు. “భూకంపం తర్వాత ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనుల్లో శ్రీ అటల్‌సహా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం భుజం కలిపి నిలిచింది” అని ప్రధానమంత్రి జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

   టా డిసెంబర్ 23 నుంచి 25 వరకు, గుజరాత్‌లోని ‘సిక్కు సంగత్’ గురుద్వారా లఖ్‌పత్ సాహిబ్‌లో శ్రీ గురునానక్ దేవ్ జీ గురుపర్వ్‌ వేడుకలను నిర్వహిస్తుంది. శ్రీ గురునానక్ దేవ్ తన దేశాటనలో భాగంగా లఖ్‌పట్‌లో బసచేశారు. దీనికి గుర్తుగా గురుద్వారా లఖ్‌పత్ సాహిబ్ వద్ద పావుకోళ్లు (కొయ్య పాదరక్షలు), పాల్కీ (ఊయల)తోపాటు చేతిరాతతో కూడిన  ‘గురుముఖి’, చిహ్నాలు కనిపిస్తాయి. లోగడ 2001 భూకంపం వల్ల ఈ గురుద్వారా దెబ్బతిన్నది. ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరమ్మతు పనులకు తక్షణ ప్రయత్నాలు చేపట్టారు. సిక్కు విశ్వాసంపై ప్రధానమంత్రికిగల అసమాన గౌరవాన్ని ఈ చర్యతోపాటు శ్రీ గురునానక్ దేవ్ 550వ ప్రకాష్ పర్వ్‌, శ్రీ గురుగోవింద్ సింగ్ 350వ ప్రకాష్ పర్వ్‌, శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ ప్రకాష్‌ పర్వ్‌ వేడుకల నిర్వహణ కోసం చేపట్టిన ఇటీవలి చర్యలు ప్రతిబింబిస్తాయి.

गुरुद्वारा लखपत साहिब समय की हर गति का साक्षी रहा है।

आज जब मैं इस पवित्र स्थान से जुड़ रहा हूँ, तो मुझे याद आ रहा है कि अतीत में लखपत साहिब ने कैसे कैसे झंझावातों को देखा है।

एक समय ये स्थान दूसरे देशों में जाने के लिए, व्यापार के लिए एक प्रमुख केंद्र होता था: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

2001 के भूकम्प के बाद मुझे गुरु कृपा से इस पवित्र स्थान की सेवा करने का सौभाग्य मिला था।

मुझे याद है, तब देश के अलग-अलग हिस्सों से आए शिल्पियों ने इस स्थान के मौलिक गौरव को संरक्षित किया: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

प्राचीन लेखन शैली से यहां की दीवारों पर गुरूवाणी अंकित की गई।

इस प्रोजेक्ट को तब यूनेस्को ने सम्मानित भी किया था: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

गुरु नानकदेव जी का संदेश पूरी दुनिया तक नई ऊर्जा के साथ पहुंचे, इसके लिए हर स्तर पर प्रयास किए गए।

दशकों से जिस करतारपुर साहिब कॉरिडोर की प्रतीक्षा थी, 2019 में हमारी सरकार ने ही उसके निर्माण का काम पूरा किया: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

अभी हाल ही में हम अफगानिस्तान से स-सम्मान गुरु ग्रंथ साहिब के स्वरूपों को भारत लाने में सफल रहे हैं।

गुरु कृपा का इससे बड़ा अनुभव किसी के लिए और क्या हो सकता है? – PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

कुछ महीने पहले जब मैं अमेरिका गया था, तो वहां अमेरिका ने भारत को 150 से ज्यादा ऐतिहासिक वस्तुएं लौटाईं।

इसमें से एक पेशकब्ज या छोटी तलवार भी है, जिस पर फारसी में गुरु हरगोबिंद जी का नाम लिखा है।

यानि ये वापस लाने का सौभाग्य भी हमारी ही सरकार को मिला: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

ये गुजरात के लिए हमेशा गौरव की बात रहा है कि खालसा पंथ की स्थापना में अहम भूमिका निभाने वाले पंज प्यारों में से चौथे गुरसिख, भाई मोकहम सिंह जी गुजरात के ही थे।

देवभूमि द्वारका में उनकी स्मृति में गुरुद्वारा बेट द्वारका भाई मोहकम सिंघ का निर्माण हुआ है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

गुरु नानक देव जी और उनके बाद हमारे अलग-अलग गुरुओं ने भारत की चेतना को तो प्रज्वलित रखा ही, भारत को भी सुरक्षित रखने का मार्ग बनाया: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

हमारे गुरुओं का योगदान केवल समाज और आध्यात्म तक ही सीमित नहीं है।

बल्कि हमारा राष्ट्र, राष्ट्र का चिंतन, राष्ट्र की आस्था और अखंडता अगर आज सुरक्षित है, तो उसके भी मूल में सिख गुरुओं की महान तपस्या है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

जिस तरह गुरु तेगबहादुर जी मानवता के प्रति अपने विचारों के लिए सदैव अडिग रहे, वो हमें भारत की आत्मा के दर्शन कराता है।

जिस तरह देश ने उन्हें ‘हिन्द की चादर’ की पदवी दी, वो हमें सिख परंपरा के प्रति हर एक भारतवासी के जुड़ाव को दिखाता है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

औरंगज़ेब के खिलाफ गुरु तेग बहादुर का पराक्रम और उनका बलिदान हमें सिखाता है कि आतंक और मजहबी कट्टरता से देश कैसे लड़ता है।

इसी तरह, दशम गुरु, गुरुगोबिन्द सिंह साहिब का जीवन भी पग-पग पर तप और बलिदान का एक जीता जागता उदाहरण है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

अंग्रेजों के शासन में भी हमारे सिख भाइयों बहनों ने जिस वीरता के साथ देश की आज़ादी के लिए संघर्ष किया, हमारा आज़ादी का संग्राम, जलियाँवाला बाग की वो धरती, आज भी उन बलिदानों की साक्षी है: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

कश्मीर से कन्याकुमारी तक, कच्छ से कोहिमा तक, पूरा देश एक साथ सपने देख रहा है, एक साथ उनकी सिद्धि के लिए प्रयास कर रहा है।

आज देश का मंत्र है- एक भारत, श्रेष्ठ भारत।

आज देश का लक्ष्य है- एक नए समर्थ भारत का पुनरोदय।

आज देश की नीति है- हर गरीब की सेवा, हर वंचित को प्राथमिकता: PM

— PMO India (@PMOIndia) December 25, 2021

आज हम सभी के श्रद्धेय अटल जी की जन्म जयंती भी है।

अटल जी का कच्छ से विशेष स्नेह था।

भूकंप के बाद यहां हुए विकास कार्यों में अटल जी और उनकी सरकार कंधे से कंधा मिलाकर खड़ी रही थी: PM @narendramodi

— PMO India (@PMOIndia) December 25, 2021

***

DS/AK