Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ గిరిధర్ మాలవీయ మృతికి సంతాపం తెలిపిన ప్రధానమంత్రి


భారత రత్న, ‘మహామాన’ పండిత్ మదన్ మోహన్ మాలవీయ మునిమనవడు శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ గిరిధర్ మాలవీయ గంగా నది ప్రక్షాళన కోసం చేసిన అవిరళ కృషి, విద్యా రంగ సమున్నతి కోసం అందించిన తోడ్పాటులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని ఈ సందేశాన్ని పోస్ట్ చేశారు:

“భారత రత్న, మహామాన పండిత్ మదన్ మోహన్ మాలవీయ మునిమనవడు శ్రీ గిరిధర్ మాలవీయ మృతి  నన్ను కలిచి వేసింది. వారి మృతి కేవలం విద్యా రంగానికే కాదు, మొత్తం దేశానికే తీరని లోటు. గంగా ప్రక్షాళన  ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిది. న్యాయ రంగంలో సైతం ఆయన తనదైన పంథాలో సేవలు అందించి విలక్షణ గుర్తింపు పొందారు. గతంలో శ్రీ గిరిధర్ మాలవీయను నేరుగా కలుసుకునే చక్కని అవకాశం నాకు లభించింది. 2014, 2019 ఎన్నికల్లో నా సొంత నియోజకవర్గమైన వారణాసిలో నా పేరును ప్రతిపాదించింది వారేనన్న విషయాన్ని  నేను మరువజాలను. ఇటువంటి విచారకర సందర్భాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు వారి కుటుంబానికి అందించుగాక . ఓం శాంతి!”