Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ కేసరినాథ్‌ త్రిపాఠీ కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం


    శ్చిమ బెంగాల్‌ పూర్వ గవర్నర్‌ శ్రీ కేసరినాథ్‌ త్రిపాఠీ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. కాగా, త్రిపాఠీ లోగడ బీహార్‌, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలకూ గవర్నర్‌గా స్వల్పకాలం బాధ్యతలు నిర్వర్తించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “శ్రీ కేసరినాథ్ త్రిపాఠీ తన సేవలతో, మేధస్సుతో చిరస్మరణీయ గౌరవాదరాలు పొందారు. రాజ్యాంగ సంబంధ అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించడమేగాక రాష్ట్ర ప్రగతికి విశేష కృషి చేశారు. ఆయన మృతి నన్నెంతో బాధించింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నాను… ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS