Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ కె.వి. సంపత్ కుమార్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


సంస్కృత దినపత్రిక సుధర్మ సంపాదకుడు శ్రీ కె.వి. సంపత్ కుమార్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘శ్రీ కె.వి. సంపత్ కుమార్ గారు ఒక ప్రేరణాత్మకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. సంస్కృతాన్ని పరిరక్షించడం లోను, ఆ భాష
లోకప్రియత్వాన్ని సంపాదించుకొనేటట్లు- ప్రత్యేకించి యువత లో- ఆదరణ పొందేటట్టు చేయడం లోను ఆయన అలుపెరుగక కృషి చేశారు.  ఆయన లోని తీవ్ర ఉత్సాహం, దృఢ సంకల్పం స్ఫూర్తి ని అందించేటటువంటివి. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే నా సంతాపం. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.