Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఎన్.విట్ఠల్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారి శ్రీ ఎన్. విట్ఠల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ శ్రీ ఎన్. విట్ఠల్ గారి ని ఒక విశిష్టమైనటువంటి ప్రభుత్వోద్యోగి గాను, విభిన్న రంగాల లో భారతదేశం యొక్క వృద్ధి పురోగమనానికి దోహదపడినటువంటి అధికారి గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన గుజరాత్ లో పనిచేసిన కాలం లో ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి లో కూడా ఒక కీలకమైన పాత్ర ను పోషించారు. ఆయన ఇక లేరని తెలిసి బాధ పడ్డాను. ఆయన కుటుంబానికి మరియు ఆయన యొక్క మిత్రుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.