Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్‌ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం


మలయాళ సినిమా, సాహిత్య రంగాల్లో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలపై లోతైన అన్వేషణతో సాగిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ రచనలు తరాలను తీర్చిదిద్దాయని, భవిష్యత్తులోనూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.

ఎక్స్‌‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘మలయాళ సినిమా, సాహిత్య రంగంలో అత్యంత గౌరవనీయ వ్యక్తుల్లో ఒకరైన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. మానవ ఉద్వేగాలపై లోతైన అన్వేషణతో సాగిన ఆయన రచనలు తరాలను తీర్చిదిద్దాయి. భవిష్యత్తులోనూ స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటాయి. అణగారిన వర్గాల గొంతుకగా ఆయన నిలిచారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’

 

 

***

MJPS/VJ