Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధానమంత్రి

శ్రీ అరబిందో 150వ జయంతి  సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రసంగించిన ప్రధానమంత్రి


శ్రీ అరబిందో 150వ జయంతి సందర్భంగా పుదుచ్చేరి లోని కంబన్ కలై సంగమ్ లో ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. శ్రీ అరబిందో గౌరవార్థం ఒక స్మారక నాణేన్ని , పోస్టల్ స్టాంపును ప్రధాన మంత్రి విడుదల చేశారు.

 

సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, సంవత్సరం పొడవునా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటున్న శ్రీ అరబిందో 150వ జయంతి ప్రాముఖ్యతను వివరించారు. శ్రీ అరబిందో స్మారక నాణెం , పోస్టల్ స్టాంపును విడుదల చేయడం ద్వారా దేశం ఆయనకు నివాళులు అర్పిస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలు భారత దేశ సంకల్పాలకు కొత్త శక్తిని, బలాన్ని

ఇస్తాయని ప్రధాన మంత్రి విశ్వాసం వ్య క్తం చేశారు.

 

అనేక గొప్ప కార్యక్రమాలు ఒకేసారి

జరిగినప్పుడు, తరుచుగా ‘యోగ శ క్తి’ అంటే వాటి వెనుక ఒక సామూహిక, సమైక్య శక్తి ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్ర్య సంగ్రామానికి

తోడ్పడడమే కాకుండా దేశ ఆత్మకు కొత్త జీవాన్ని అందించిన ఎంతో మంది గొప్ప వ్యక్తులను ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారిలో ముగ్గురు మహనీయులు -శ్రీ అరబిందో, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ ఒకే సమయంలో తమ జీవితాలలో అనేక గొప్ప సంఘటనలను కలిగి ఉన్నారని, ఈ సంఘటనలు కేవలం వారి జీవితాలను మార్చడమే కాకుండా జాతి జీవనాన్ని కూడా అమితంగా ప్రభావితం చేశాయని ప్రధాన మంత్రి అన్నారు. 1893లో శ్రీ అరబిందో భారతదేశానికి తిరిగి వచ్చారని, అదే సంవత్సరం స్వామి వివేకానంద ప్రపంచ మతాల పార్లమెంట్ లో తన చిరస్మరణీయ ఉపన్యాసం ఇవ్వడానికి అమెరికా వెళ్లారని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. అదే ఏడాది గాంధీజీ దక్షిణాఫ్రికాకు వెళ్లారని, ఇది ఆయన మహాత్మాగాంధీగా రూపాంతరం చెందడానికి నాంది పలికిందని ప్రధాన మంత్రి అన్నారు. దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకొంటున్న ప్రస్తుత తరుణంలోనూ, అమృత్ కాల్ యాత్రను ప్రారంభిస్తున్న ప్రస్తుత కాలంలోనూ, శ్రీ అరబిందో 150వ జయంతి, నేతాజీ సుభాష్ 125వ జయంతి జరుపుకోవడం ఒకే విధమైన సంఘటనల సందర్భంగా ఆయన పేర్కొన్నారు. “ప్రేరణ , చర్య కలిసినప్పుడు, అసాధ్యమైన లక్ష్యం కూడా అనివార్యంగా నెరవేరుతుంది. ఈ రోజు అమృత్ కాల్ లో దేశం సాధించిన విజయాలు, ‘సబ్ కా

ప్రయాస్’ సంకల్పం దీనికి నిదర్శనం” అని ఆయన అన్నారు.

 

శ్రీ అరబిందో జీవితం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’కు ప్రతిబింబం అని ప్రధాన మంత్రి అన్నారు, ఎందుకంటే ఆయన బెంగాల్ లో జన్మించారు. గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, హిందీ, సంస్కృతంతో సహా అనేక భాషలు తెలుసు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం గుజరాత్ , పుదుచ్చేరిలో గడిపారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా లోతైన ముద్ర వేశారు. శ్రీ అరబిందో బోధ లను గురించి ప్రధాన మంత్రి వివరించారు.

మనం మన సంప్రదాయాలను, సంస్కృతి గురించి తెలుసుకొని, వాటి ద్వారా జీవించడం మొదలుపెట్టినప్పుడు, మన భిన్నత్వం మన జీవితాలలో ఒక సహజ వేడుకగా మారే క్షణం ఆ క్షణంలో జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

“ఆజాదీ కా అమృత్ కాల్ కు ఇది గొప్ప ప్రేరణ. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ను వివరించడానికి ఇంతకంటే మెరుగైన మార్గం మరొకటి లేదు‘‘ అని ఆయన అన్నారు.

 

కాశీ తమిళ సంగమంలో పాల్గొనే అవకాశాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశం తన సంస్కృతి , సంప్రదాయాల ద్వారా దేశాన్ని ఎలా కలుపుతుందో చెప్పడానికి ఈ అద్భుతమైన సంఘటన ఒక గొప్ప ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ‘‘నేటి యువత భాష, వస్త్రధారణ ఆధారంగా వేరుచేసే రాజకీయాలను వదిలి ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్ రాజకీయాలను స్వీకరిస్తోందని కాశీ తమిళ సంగమం చూపించింది. ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, అమృత్ కాల్ లో కాశీ తమిళ సంగమం స్ఫూర్తిని మనం విస్తరించాల్సిన అవసరం ఉంది‘‘ అని ఆయన అన్నారు.

 

శ్రీ అరబిందో జీవితం ఆధునిక శాస్త్రీయ దృక్పథం, రాజకీయ తిరుగుబాటు,దైవిక భావన కలిగి ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.బెంగాల్ విభజన సమయంలో ఆయన చేసిన ‘నో కాంప్రమైజ్’ నినాదాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సైద్ధాంతిక స్పష్టత, సాంస్కృతిక బలం, దేశభక్తి ఆనాటి స్వాతంత్ర్య సమరయోధులకు ఆదర్శంగా నిలిచాయి. లోతైన తాత్విక, ఆధ్యాత్మిక అంశాలపై పట్టున్న శ్రీ అరబిందో లోని ఋషి లాంటి లక్షణాలను కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. ఉపనిషత్తులకు సామాజిక సేవ అనే అంశాన్ని ఆయన జోడించారని తెలిపారు. ఎలాంటి న్యూనతా భావాలకు తావులేకుండా అభివృద్ధి చెందిన భారత యాత్రలో అన్ని అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని ప్రధాని సూచించారు.

‘‘మనం ‘ఇండియా ఫస్ట్’ అనే మంత్రంతో పని చేస్తున్నాము. మన వారసత్వాన్ని మొత్తం ప్రపంచం ముందు గర్వంగా ఉంచుతున్నాము”” అన్నారు.

 

అరబిందో జీవితం భారతదేశానికి ఉన్న మరో బలానికి ప్రతీక అని, ఇది “బానిసత్వ మనస్తత్వం నుండి స్వేచ్ఛ” అనే ఐదు ప్రతిజ్ఞలలో ఒకటి అని ప్రధాన మంత్రి అన్నారు. పాశ్చాత్య ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, శ్రీ అరబిందో తాను జైలులో ఉన్న సమయంలో గీతతో సంబంధం కలిగి ఉన్నారని, ఆయన భారతీయ సంస్కృతి ధృఢ స్వరంగా ఉద్భవించారని ఆయన అన్నారు. రామాయణం, మహాభారతం, ఉపనిషత్తుల నుంచి కాళిదాసు, భవభూతి, భరతన్ వరకు గ్రంథాలను ఆయన అధ్యయనం చేసి అనువదించారని శ్రీ మోదీ గుర్తు చేశారు.

“శ్రీ అరబిందో ఆలోచనలలో ప్రజలు భారతదేశాన్ని చూశారు, అదే అరబిందో ఒకప్పుడు తన యవ్వనంలో భారతీయతకు దూరంగా ఉంచబడ్డారు. ఇదే భారత దేశానికి, భారతీయతకు నిజమైన బలం” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

దేశ. సుసంపన్నమైన సాంస్కృతిక చరిత్ర గురించి ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ,

” ప్రతికూల పరిస్థితులలో కొద్దిగా అణచి వేయబడి ఉండొచ్చు. కొద్దిగా తగ్గి ఉండొచ్చు.కానీ అది జీవం కోల్పోదు” అని అన్నారు. భారతదేశ సాంస్కృతిక అమరత్వం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘మానవ నాగరికత యొక్క అత్యంత పవిత్ర ఆలోచన, మానవత్వ అత్యంత సహజమైన స్వరం భారతదేశం. మహర్షి అరబిందో కాలం

లోనూ , ఇప్పుడు ఆజాదీ కా అమృత్ కాల్ లోనూ కూడా అది అమరం‘‘ అని అన్నారు.

 

ప్రపంచం ఈ రోజు ఎదుర్కొంటున్న తీవ్ర

సవాళ్ల.ను ప్రస్తావిస్తూ ప్రసంగం ముగించిన ప్రధానమంత్రి – ఈ సవాళ్ళ ను అధిగమించడంలో భారత దేశం పాత్ర ప్రాముఖ్యాన్ని వివరించారు. ‘‘అందుకే మహర్షి అరబిందో నుంచి స్ఫూర్తి పొంది సబ్ కా ప్రయాస్ ద్వారా అభివృద్ధి చెందిన భారతాన్ని సృష్టించాలని‘‘ ఆయన పిలుపు ఇచ్చారు.

 

నేపథ్యం

 

శ్రీ అరబిందో 1872 ఆగస్టు 15 న జన్మించారు, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో శాశ్వతమైన కృషి చేసిన దూరదృష్టి గల వ్యక్తి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ – 75 సంవత్సరాల స్వాతంత్ర్యం సందర్భంగా భారతదేశ ప్రజల సుసంపన్నమైన సంస్కృతి , విజయాల అద్భుతమైన చరిత్రను వేడుకగా జరుపుకుంటున్న వేళ- దేశవ్యాప్తంగా ఏడాదిపాటు

కార్యక్రమాలతో శ్రీ అరబిందో 150వ జయంతిని కూడా నిర్వహిస్తున్నారు.

 

 

*****