Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ‌ న‌గ‌ర్ లో ప్ర‌ధాన మంత్రి: కిశన్ గంగ జ‌ల‌ విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు

శ్రీ‌ న‌గ‌ర్ లో ప్ర‌ధాన మంత్రి:  కిశన్ గంగ జ‌ల‌ విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు


కిశన్ గంగ జ‌ల‌విద్యుత్ కేంద్రాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ‌ న‌గ‌ర్ లో ఈ రోజు జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

శ్రీ‌ న‌గ‌ర్ రింగు రోడ్డు కు పునాది రాయిని కూడా ఆయ‌న వేశారు.

స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌ కాలంలో వివిధ సందర్భాలలో జ‌మ్ము & క‌శ్మీర్ రాష్ట్రానికి విచ్చేసిన సంద‌ర్భాల‌ను గుర్తుకు తెచ్చుకొన్నారు.

ర‌మ్ జాన్ మాసం ప్ర‌వ‌క్త మొహ‌మ్మ‌ద్ యొక్క సందేశాన్ని మ‌రియు బోధ‌న‌ల‌ను జ్ఞ‌ప్తి కి తెచ్చుకొనే కాలం అని ఆయ‌న పేర్కొన్నారు.

330 ఎమ్‌డ‌బ్ల్యు సామ‌ర్ధ్యం క‌లిగిన కిశన్ గంగ జ‌ల‌విద్యుత్ ప‌థ‌కం రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్తు అవ‌స‌రాల‌ను తీర్చ‌డంలో ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

రాష్ట్రం లో క‌శ్మీర్‌, జ‌మ్ము మ‌రియు ల‌ద్దాఖ్.. ఈ మూడు ప్రాంతాలను సంతులిత రీతిన అభివృద్ధి పర‌చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయ‌న స్పష్టంచేశారు.

****