Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ‌ డియగో మారాడోనా క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


శ్రీ‌ డియగో మారాడోనా క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్య‌క్తం చేశారు. 

‘‘శ్రీ డియ‌గో మారాడోనా  ఓ ప్రఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు.  ఆయన ప్ర‌పంచ‌వ్యాప్తం గా అమిత ప్ర‌జాద‌ర‌ణ కు నోచుకొన్నారు.  తన వృత్తి జీవ‌న పర్యంతం ఫుట్ బాల్ మైదానం లో శ్రేష్ఠమైన ఆట ను ప్రదర్శించి, ఆయన మనకు కొన్ని అత్యుత్త‌మ క్రీడా ఘ‌డియ‌ల‌ను అందించారు.  ఆయ‌న అకాలిక మ‌ర‌ణం తో మ‌నం అంద‌రం ఎంతో దుఃఖిస్తున్నాము.  ఆయ‌న ఆత్మ‌ కు శాంతి ల‌భించు గాక’’ అని ఒక ట్వీట‌్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***