Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీలంక ప్రతిపక్ష నేతతో ప్రధాని భేటీ


శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంక విపక్ష నేత శ్రీ సజిత్ ప్రేమదాసతో భేటీ అయ్యారు.

 

‘శ్రీలంక ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసను కలవడం ఆనందంగా ఉంది. భారత్-శ్రీలంక స్నేహాన్ని బలోపేతం చేయడంలో ఆయన వ్యక్తిగత సహకారం, నిబద్ధత ప్రశంసనీయం. రెండు దేశాల ప్రత్యేక భాగస్వామ్యానికి శ్రీలంకలో రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తోంది. పరస్పర సహకారం, బలమైన అభివృద్ధి భాగస్వామ్యం రెండు దేశాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.