Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో ప్రధాని భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కొలంబోలో శ్రీలంకలోని తమిళ సామాజిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళ నాయకులు ఆర్.సంపంతన్, మావై సేనతిరాజా మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు.

 

“శ్రీలంకలోని తమిళ సామాజిక నాయకులను కలవడం నాకు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా పరిచయమున్న గౌరవ తమిళ నాయకులు శ్రీ ఆర్.సంపంతన్, శ్రీ మావై సేనతిరాజాల మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేశాను. సమైక్య శ్రీలంకలోని తమిళ సమాజానికి సమానత్వం, గౌరవం, న్యాయంతో కూడిన జీవితానికి భారత్ అచంచలమైన నిబద్ధతను కలిగివుందని పునరుద్ఘాటించాను. ఈ పర్యటన సందర్భంగా నేను ప్రారంభించిన అనేక ప్రాజెక్టులు, కార్యక్రమాలు తమిళుల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పురోగతికి దోహదపడతాయని విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో వేర్వేరు పోస్టుల్లో పేర్కొన్నారు.