Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీమతి దీపాలీ ఝవేరి.. మిస్టర్ ఓటాలను జ‌పాన్‌లోని జోటో ఫైర్ స్టేష‌న్ సత్కరించడంపై ప్ర‌ధానమంత్రి హర్షం


   టోక్యో నగరంలో నిరుడు అక్టోబరు నెలలో ‘దాండియా మస్తీ-2022’ సందర్భంగా హఠాత్తుగా స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తిని ‘సీపీఆర్‌, ఎఇడి’ ప్రక్రియల ద్వారా ప్రవాస భారతీయురాలు శ్రీమతి దీపాలీ ఝవేరీతోపాటు జపాన్‌ పౌరుడు మిస్టర్‌ ఓటా రక్షించారు. ఈ నేపథ్యంలో జోటో అగ్నిమాపక కేంద్రం వీరిద్దరినీ ఇటీవల సత్కరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దీనిపై భారత్‌లోని జపాన్ రాయబార కార్యాలయం ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

“ఈ సమాచారం తెలిసి నేనెంతో సంతోషించాను. ఆపదనలో ఉన్నవారికి సకాలంలో సహాయం అందించడంలోగల ప్రాధాన్యాన్ని ఈ ఉదంతం నొక్కి చెబుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH