Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీమతి తులసి గౌడ మృతికి ప్రధానమంత్రి సంతాపం


 కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ పురస్కార స్వీకర్త శ్రీమతి తులసి గౌడ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, ‘పద్మ’ పురస్కార గ్రహీత శ్రీమతి తులసి గౌడ గారు మన మధ్య ఇక లేరని తెలిసి ఎంతో బాధపడ్డాను. వేల సంఖ్యలో మొక్కల్ని నాటి  పర్యావరణాన్ని సంరక్షిస్తూ, ప్రకృతి సంపదను పెంచిపోషించడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. పర్యావరణ సంరక్షణ విషయంలో మార్గదర్శిలా ఆమె కలకాలం నిలిచి ఉంటారు. ఆమె చేసిన కృషి మన భూమిని పరిరక్షించుకోవడానికి తరాల తరబడి ప్రేరణనిస్తూ ఉంటుంది. ఆమె కుటుంబానికి, ఆమెను అభిమానించే వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’.

“ಕರ್ನಾಟಕದ ಪರಿಸರವಾದಿ ಮತ್ತು ಪದ್ಮ ಪ್ರಶಸ್ತಿ ಪುರಸ್ಕೃತರಾದ ಶ್ರೀಮತಿ ತುಳಸಿ ಗೌಡ ಅವರ ನಿಧನ ತೀವ್ರ ದುಃಖ ತಂದಿದೆ. ಅವರು ತಮ್ಮ ಇಡೀ ಬದುಕನ್ನು ಪ್ರಕೃತಿ ಪೋಷಣೆಗಾಗಿ ಮುಡಿಪಾಗಿಟ್ಟು, ಸಾವಿರಾರು ಗಿಡಗಳನ್ನು ನೆಟ್ಟು ಬೆಳೆಸಿ ನಮ್ಮ ಪರಿಸರವನ್ನು ಸಂರಕ್ಷಿಸಿದವರು.  ಪರಿಸರ ರಕ್ಷಣೆಗೆ ಸದಾ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡುವ ಬೆಳಕಾಗಿ ಅವರು ಉಳಿಯುತ್ತಾರೆ. ಅವರ ಕೆಲಸಗಳು ನಮ್ಮ ಭೂಗ್ರಹವನ್ನು ರಕ್ಷಿಸಲು ತಲೆಮಾರುಗಳಿಗೆ ಪ್ರೇರಣೆ ನೀಡುತ್ತಿರುತ್ತವೆ. ಅವರ ಕುಟುಂಬ ಮತ್ತು ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಸಂತಾಪಗಳು. ಓಂ ಶಾಂತಿ.”

 

 

 

********

MJPS/SR/SKS