Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీఎల్.కె. ఆడ్ వాణీ ని భారత్ రత్న తో సమ్మానించడంజరుగుతుందనిప్రకటించిన ప్రధాన మంత్రి


చిరకాల అనుభవం కలిగిన నేత శ్రీ లాల్ కృష్ణ ఆడ్ వాణీ ని దేశం లో అత్యంత ఉన్నన్నతమైంది అయినటువంటి పౌర పురస్కారం ‘భారత్ రత్న’ తో గౌరవించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం ద్వారా పొందుపరచిన ఒక సందేశం లో ప్రకటించారు.

 

శ్రీ ఎల్. కె. ఆడ్ వాణీ తో శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు కూడాను. ఈ సమ్మానాన్ని శ్రీ ఆడ్ వాణీ అందుకోనుండడం పట్ల ఆయన కు అభినందనల ను శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో

‘‘శ్రీ ఎల్.కె. ఆడ్ వాణీ గారి కి భారత్ రత్న ను కట్టబెట్టడం జరుగుతుంది అని తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన తో నేను మాట్లాడాను కూడా. ఈ సత్కారం తో ఆయన కు సమ్మానం లభించనుండడం పట్ల ఆయన కు అభినందనల ను తెలియజేశాను. మన కాలం లో అమిత మాన్యుడు అయినటువంటి రాజనీతిజ్ఞ‌ుల లో ఒకరైన ఆయన భారతదేశం యొక్క అభి వృద్ధి కి అందించిన తోడ్పాటు మహత్తరమైంది. అట్టడుగు స్థాయి లో పనిచేయడం నుండి మొదలైన మన దేశానికి ఉప ప్రధాని గా సేవల ను అందించడం వరకు ఆయన యొక్క జీవనం ఎదుగుతూ వచ్చింది. ఆయన మన దేశానికి హోం శాఖ మంత్రి గాను మరియు సమాచార, ప్రసార శాఖ మంత్రి గా కూడా పేరు తెచ్చుకొన్నారు. ఆయన ఏర్పరచినటువంటి పార్లమెంటరీ సంప్రదాయాలు ఎల్లప్పటికీ మార్గదర్శకప్రాయం అయినటువంటివీ, చాలా లోతైన అవగాహన తో కూడుకొన్నటువంటివీనూ.

 

సార్వజనిక జీవనం లో ఆడ్ వాణీ గారు దశాబ్దాలు పాటు చేసిన సేవ లలో పారదర్శకత్వానికి మరియు అఖండత కు తిరుగులేనటువంటి నిబద్ధత ను చాటిచెప్పి రాజకీయ నైతిక పంథా లో ఒక మార్గసూచకమైన ప్రమాణాన్ని నెలకొల్పాయి. జాతీయ ఏకత్వాన్ని మరియు సాంస్కృతిక పునరుజ్జావనాన్ని పెంపొందింప చేసే దిశ లో ఆయన సాటి లేనటువంటి ప్రయాసల కు నడుం కట్టారు. ఆయన కు భారత్ రత్న తో సమ్మానించనుండడం అనేది ఒక చాలా ఉద్వేగభరితమైనటువంటి క్షణం గా నాకు అనిపిస్తోంది అంటాను. ఆయన తో భేటీ అయ్యి ఆయన తో మాట్లాడే అవకాశాల ను మరి ఆయన వద్ద నుండి నేర్చుకొనే అవకాశాలను లెక్కపెట్టలేనన్ని దక్కించుకోవడం నాకు లభించిన సౌభాగ్యం అని నేను ఎల్లప్పటికీ భావిస్తుంటాను. అని పేర్కొన్నారు.