Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్న ప్రధాన మంత్రి


శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతి సందర్భంగా ఆయనను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్మరించుకున్నారు.

“శ్యామ్ జీ కృష్ణ వర్మ జయంతిని పురస్కరించుకొని ఆయనను నేను గుర్తుకు తెచ్చుకున్నాను. స్వాతంత్ర్య సమరానికి ఆయన చాలా పెద్ద స్థాయిలో అందించిన మద్దతు మన హృద‌యాలలో సజీవంగా నిలచి ఉంది. స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకొనేటట్లు అనేక మందికి ప్రేరణను కలిగించిన దేశ భక్తి మార్గదర్శకుడిగా ఆయన చిరస్మరణీయుడు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***