Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శౌర్య పురస్కార విజేతలను సన్మానించడానికి ఒక వెబ్ సైట్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి శౌర్య పురస్కార విజేతలైన వారందరినీ సన్మానించడానికి ఒక వెబ్ సైట్ ను ఈ రోజు ప్రారంభించారు.

http://gallantryawards.gov.in/ వెబ్ సైట్ ప్రారంభం అయిన విషయాన్ని ప్రధాన మంత్రి తన ట్విటర్ ఖాతా లో వరుసగా రాసిన ట్వీట్ సందేశాల ద్వారా ప్రకటిస్తూ, ఈ పోర్టల్ మన సాయుధ దళ సిబ్బందితో పాటు పౌరులలో నూ ఉన్నటువంటి అత్యంత సాహసులైన పురుషులు మరియు మహిళల వీర గాథలను తెలియజెప్పడమే కాకుండా వాటిని పదిలపరుస్తుందని పేర్కొన్నారు.

‘‘స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుండి శౌర్య బహుమతులను స్వీకరించినటువంటి మన కథానాయకులను స్మరించుకొనేందుకుగాను http://gallantryawards.gov.in/ అనే పేరుతో ఒక వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగింది.

http://gallantryawards.gov.in/ అనేటటువంటి ఈ పోర్టల్ మన సాయుధ దళ సిబ్బందితో పాటు పౌరులలో కూడా ఉన్నటువంటి అత్యంత సాహసులైన పురుషులు మరియు మహిళల వీర గాథలను తెలియజెప్పడమే కాకుండా వాటిని పదిలపరుస్తుంది.

ఇందులో జతపరచబడని ఏదైనా సమాచారం గాని, లేదా మరే ఛాయాచిత్రమైనా గాని మీ దగ్గర ఉంటే గనక, దయచేసి వాటిని ఈ వెబ్ సైట్ లో ఉన్న ఫీడ్ బ్యాక్ లింకు ద్వారా షేర్ చేయగలరు’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

***