Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శిఖర సమానులు… డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ జీ భారతీయుల గౌరవం, సమానత్వాల దిశగా స్వేచ్ఛా భారతం కోసం జీవితాన్ని అంకితం చేశారు


డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ జీ సమున్నత వ్యక్తిత్వం కలిగిన వారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టాలనీ, భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం, సమానత్వంతో కూడిన జీవనం దక్కాలని తపిస్తూ, అందుకోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని అన్నారు. డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ 125వ జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ శ్రద్ధాంజలి ఘటిస్తూ… డాక్టర్ మహతాబ్ ఆదర్శాలను సాకారం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో భారత రాష్ట్రపతి పొందుపరచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ.. ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ జీది ఒక సమున్నత వ్యక్తిత్వం. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టాలని, భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం, సమానత్వంతో కూడిన జీవనం దక్కాలని ఆయన తపించిపోతూ, అందుకోసమే తన జీవితాన్ని అంకితం చేశారు. ముఖ్యంగా ఒడిశా అభివృద్ధి దిశగా ఆయన అందించిన తోడ్పాటు ప్రశంసనీయం. ఆయన ఎన్నో దూరాలోచనలు కలిగిన వ్యక్తే కాకుండా మేధావి కూడా. ఆయన 125వ జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయన ఆదర్శాలను సాకారం చేయాలన్న మా నిబద్ధతను నేను ఈ వేళలో మరో సారి వ్యక్తం చేస్తున్నాను’’.

 

 

***

MJPS/SR