Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శిక్షణలో ఉన్న ఐఏఎస్ లకు ప్రధాన మంత్రి ఉద్బోధ

శిక్షణలో ఉన్న ఐఏఎస్ లకు ప్రధాన మంత్రి ఉద్బోధ


2015 బ్యాచ్ కు చెందిన 181 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.

వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్న గాంధీ మహాత్ముని మాటలను ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రధాన మంత్రి ఐఏఎస్ శిక్షణార్థులకు ఉద్బోధించారు.

శిక్షణ పొందుతున్న వారిలో ఎక్కువ మంది ఐఏఎస్ లో చేరడానికన్నా ముందు, ప్రైవేట్ రంగంలో పని చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇదివరకటి అసైన్మెంట్లు “నౌకరీలు” కాగా, ఇప్పుడు వారు చేయబోయేది మాత్రం “సేవ”అని ఆయన తెలిపారు.

ఈశాన్య ప్రాంతాలలో అభివృద్ధి, అనుసంధానాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి వివరిస్తూ, ఈశాన్య ప్రాంతాలు అభివృద్ధి చెందితే మొత్తం దేశమే ముందడుగు వేసినట్లు అవుతుందన్నారు.

నాలుగు దశాబ్దాలకు పైగా భారత దేశమంతటా తాను పర్యటించానని, అంతేకాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకు లభించిన అనుభవం ప్రధాన మంత్రిగా తాను చేయవలసిన పనిలో తోడ్పడుతున్నాయని ఒక ప్రశ్నకు శ్రీ నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.

***