Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శాన్ జోస్ – కాలిఫోర్నియా లో డిజిట‌ల్ ఇండియా డిన్న‌ర్ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ;

శాన్ జోస్ – కాలిఫోర్నియా లో డిజిట‌ల్ ఇండియా డిన్న‌ర్ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ;

శాన్ జోస్ – కాలిఫోర్నియా లో డిజిట‌ల్ ఇండియా డిన్న‌ర్ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం ;


ధ‌న్య‌వాదాలు – శంత‌ను, జాన్‌, స‌త్య‌, పాల్‌, సుంద‌ర్‌, వెంక‌టేశ్‌…

బిగ్ థాంక్యూ…!

ఇది ముందుగా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏర్పాటు చేసిన‌ది కాద‌ని నేను అనుకుంటున్నాను. కానీ, ఈ వేదిక పైన డిజిట‌ల్ ఎకాన‌మీ రంగంలో భార‌త‌- అమెరికా భాగ‌స్వామ్యం ప్ర‌స్ఫుటంగా క‌నిపిస్తోంది.

అంద‌రికీ శుభ సాయంత్రం!

ప్ర‌పంచ న‌వ్య ఆకృతీక‌ర‌ణ‌కు కృషి చేసే, న‌వ క‌ల్ప‌న‌ల‌కు కేంద్రంగా భాసిల్లే బృందం ఒకే గొడుగు కింద కొలువు తీరిన సంద‌ర్భం..స‌న్నివేశం ఏదైనా ఎక్క‌డైనా ఉందంటే…అది ఇక్క‌డేన‌ని నేను గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను ! ఇండియాలో కానీ ఇక్క‌డ కానీ, ప్ర‌జా జీవితంలో ఉండే నేత‌ల గురించి నేను మాట్లాడ‌టం లేదు. కాలిఫోర్నియా కు రావ‌డం నాకెంతో ఆనందంగా ఉంది. ప్ర‌పంచంలో సూర్యాస్త‌మ‌యం జ‌రిగే చిట్ట చివ‌రి ప్ర‌దేశం ఇదే !….కానీ నూత‌న‌ ఆలోచ‌న‌లు తొలి సారిగా వెలుగు చూసేది ఇక్క‌డే ! నేటి రాత్రి మీరంతా ఇక్క‌డ మాతో చేర‌డం మాకు ఎంతో గౌర‌వ‌ప్ర‌దమైన విష‌యం ! మీలో ప‌లువురిని నేను దిల్లీ లోను, న్యూయార్క్ లోను క‌లుసుకున్నాను. మ‌రి కొంద‌రిని ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ , ఇన్ స్టాగ్రామ్ ద్వారా క‌లుసుకున్నాను. న‌వ్య ప్ర‌పంచంలో సామాజిక మాధ్య‌మాలే స‌రికొత్త ఇరుగు పొరుగుగా మారిపోయాయి ! ఫేస్ బుక్ క‌నుక ఒక దేశ‌మే అయిన‌ట్ల‌యితే , అది ప్ర‌పంచంలోని అత్య‌ధిక జ‌నాభా ఉన్న‌ మూడో దేశంగా నిలిచేది.! గూగుల్ నేడు ఉపాధ్యాయుల‌కు విస్మ‌య స్ఫూర్తిని త‌గ్గించి, తాత‌లకు, బామ్మ‌లకు ప‌ని ఒత్తిడిని త‌గ్గించంది. ట్విట్ట‌ర్ ప్ర‌తి ఒక్క‌రిని విలేక‌రులుగా మార్చేసింది. సిస్కో రూట‌ర్ల ద్వారా అత్యుత్త‌మంగా ట్రాఫిక్ లైట్లు ప‌నిచేస్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితి ఏంటంటే… నీవు నిద్రలో ఉన్నావా, మెల‌కువ‌గా ఉన్నావా అనేది ముఖ్యం కాదు. మ‌నం ఆన్‌లైన్ లో ఉన్నామా, ఆఫ్ లైన్ లో ఉన్నామా అనేదే ముఖ్య‌మైపోయింది !.ఆండ్రాయిడా ..ఐ.ఓ.ఎస్‌. .విండోస్‌….. వీటిలో దేనిని ఎంచుకోవాల‌నేదే ప్ర‌స్తుతం యువ‌త‌రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కంప్యూట‌ర్ల నుంచి క‌మ్యూనికేష‌న్ల వ‌ర‌కు, వినోదం నుంచి విద్య వ‌ర‌కు, డాక్యుమెంట్ల ప్రింటింగ్ నుంచి ఉత్ప‌త్తుల ప్రింటింగ్ ( త్రీ డి ప్రింటింగ్ ) వ‌ర‌కు- వ‌స్తువుల ఇంట‌ర్నెట్ – స్వ‌ల్ప‌కాలంలో సుదీర్ఘ ప్ర‌యాణం ! శుద్ధ ఇంధ‌నం నుంచి మెరుగైన ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, ర‌వాణా భ‌ద్ర‌త వ‌ర‌కు- ప్ర‌తి ఒక్క‌టి కూడా మీరు చేసే ప‌నితో స‌మ్మిళిత‌మ‌వుతున్నాయి. ఆఫ్రికాలో ఫోన్ ద్వారా డ‌బ్బు బ‌దిలీ చేయ‌డానికి ఇది ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతోంది. గ‌తంలో మాదిరిగా చిన్న ద్వీప స‌మూహ దేశాలు చేరుకునేందుకు, గ‌తంలో మాదిరిగా సాహ‌స యాత్ర‌లు చేయ‌వ‌ల‌సిన‌ అవ‌స‌రం లేదు, మౌస్‌ను ఒక్క మారు క్లిక్ చేస్తే చాలు ! భార‌త్ లో మారుమూల గ్రామాల‌లోని త‌ల్లులు, త‌మ‌ న‌వ‌జాత శిశువుల‌ను కాపాడుకునే అవ‌కాశాలు మెరుగ‌య్యాయి. కుగ్రామాల‌లో నివ‌సించే పిల్ల‌లకు చ‌దువు అందుబాటులోకి వ‌స్తోంది. చిన్న‌కారు రైతులు త‌మ భూక‌మ‌తాల‌పై అవ‌గాహ‌న పెంచుకుని మంచి గిట్టుబాటు ధ‌ర పొందగ‌లుగుతున్నారు. స‌ముద్రంలో చేపల వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారుడు ల‌బ్ది పొందుతున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కో లోని య‌వ ఇంజ‌నీర్ భార‌త్‌లో అనారోగ్యంగా ఉన్న త‌న‌ బామ్మ‌తో , ప్ర‌తి రోజు స్కైప్‌ లో మాట్లాడి ఊర‌ట క‌లిగిస్తున్నాడు. హ‌ర్యానాకు చెందిన ఒక ఆడ‌పిల్ల తండ్రి త‌న కుమార్తెతో తీసుకున్న ` సెల్ఫీ విత్ డాట‌ర్ ` ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ఇప్పుడు ఆడ‌పిల్ల‌ల వైపు త‌ల్లిదండ్రులు దృష్టిని ఆక‌ట్టుకునే అంత‌ర్జాతీయ ఉద్య‌మంగా మారింది.ఇదంతా మీరు చేస్తున్న కృషి ఫ‌లితంగానే సాధ్య‌మైంది.

గ‌త ఏడాది మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే- మొబైల్ ఫోన్ నెట్‌వ‌ర్క్ ఉప‌యోగించుకుని , సాధికార‌త‌లో కొత్త శ‌కం ఆరంభించ‌డం జ‌రిగింది. 18 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్ల‌ను కేవ‌లం కొద్ది నెల‌ల వ్య‌వ‌ధిలోనే తెర‌చి , డైరెక్ట్ ట్రాన్స్‌ఫ‌ర్ బెనిఫిట్ ప‌థ‌కం ద్వారా పేద ప్ర‌జ‌లు ల‌బ్ది పొందేలా చేయ‌గ‌లిగాం ! త‌ద్వారా బ్యాంకు ఖాతా లేనివారికి నిధులు, నిరుపేద‌లకు అందుబాటులో బీమా ప‌థ‌కం, అవ‌సాన ద‌శ‌లో అంద‌రికీ ఫింఛ‌న్లు అందేలా చేయ‌డం జ‌రిగింది.అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞానం, ఇంట‌ర్నెట్ వినియోగం ద్వారా , గ‌త కొద్ది నెల‌ల కాలంలో -170 అప్లికేష‌న్ల‌ను గుర్తించి , వీట‌ని వినియోగించ‌డం ద్వారా ప్రభుత్వ పాల‌న మ‌రింత మెరుగ‌యేందుకు, స‌త్వ‌రంగా అభివృద్ధి జ‌రిగేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. భార‌త్‌లోని ఒక గ్రామంలోని చిన్న హ‌స్త‌క‌ళాకారుడు త‌న ఫోన్ ద్వారా న్యూయార్క్ మెట్రో రైలులో ఉన్న వినియోగ‌దారుడి ముఖంలో చిరున‌వ్వు చిందించేలా చేయ‌గ‌లిగిన‌ప్పుడు – కిర్గిస్తాన్ లో ఉన్న ఒక హృద్రోగిని దిల్లీలోని వైద్యులు చికిత్స చేసిన సంఘ‌ట‌న‌ల‌ను, బిష్‌కెక్ లో నేను చూసిన విధంగా- మ‌న జీవితాల మౌలిక స్వ‌రూపాల‌నే మార్చి వేసిన దానిని మ‌నం సృష్టించామ‌నిపించింది. వ‌య‌స్సు, విద్య‌, భాష‌, ఆదాయంతో సంబంధం లేకుండా- న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో ప్ర‌జ‌లు డిజిట‌ల్ సాంకేతిక‌త‌ను వినియోగించుకుంటున్నారు. రెండు ద‌శాబ్దాల కింద‌ట ఇది ఊహ‌కైనా అంద‌ని విష‌యం.ఈ సంద‌ర్భంగా నేను గుజ‌రాత్‌లో జ‌రిగిన ఒక విష‌యాన్ని ప్ర‌స్తావిస్తాను. ఒక పాల ఉత్ప‌త్తి కేంద్రం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా , నేను గుజ‌రాత్ మారుమూల ప‌ల్లెకు వెళ్లాను. అక్క‌డ నేను నిర‌క్ష‌రాస్యులైన ఆదివాసి మ‌హిళ‌ల‌ను క‌లుసుకోవ‌డం జ‌రిగింది. వారు త‌మ ద‌గ్గ‌ర ఉన్న చ‌ర‌వాణితో ఫొటోలు తీయ‌డం గ‌మ‌నించాను.` ఆ ఫొటోల‌ను మీరు ఏం చేస్తార‌ని ` నేన‌డిగిన ప్ర‌శ్న‌కు వ‌చ్చిన స‌మాధానం విని ఆశ్చ‌ర్య‌పోవ‌డం నా వంత‌యింది. ఇంటికి వెళ్లిన త‌ర్వాత కంప్యూట‌ర్ పై ఆ చిత్రాల‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇక‌, మ‌హారాష్ట్ర‌లోని ఒక రైతు వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల గురించి తోటి రైతుల‌కు చెప్పేందుకు వాట్స‌ప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు. డిజిట‌ల్ సాంకేతిక సృష్టి క‌ర్త‌ల క‌న్నా ఎక్కువ‌గా వినియోగ‌దారులు ఈ ఉత్ప‌త్తుల‌కు స‌రైన నిర్వ‌చ‌నం ఇస్తున్నారు. ప్ర‌పంచం సంప్ర‌దాయ‌ ప‌ద్ధ‌తుల‌తో ప్రేర‌ణ పొంది ఉండ‌వ‌చ్చ‌. మాన‌వ సంఘ‌ర్ష‌ణ‌లు, విజ‌యాల‌కు, విషాదాల‌కు సాక్షీభూతంగా నిలుస్తాం, కానీ , న‌మ్మ‌శ‌క్యం కాని రీతిలో ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చ‌గ‌ల శ‌క్తి ప్ర‌స్తుత డిజిట‌ల్ శ‌కానికి ఉంది. రెండు ద‌శాబ్దాల కింద‌ట ఇది ఊహ‌కైనా అంద‌ని విష‌యం. మనం ఇటీవ‌ల‌ వ‌దిలిపెట్టి వ‌చ్చిన శ‌తాబ్ది నుంచి ఇదే మ‌న‌ల్ని దూరం చేసింది. డిజిట‌ల్ ఎకాన‌మీ కేవ‌లం సంప‌న్నులు, విద్యావంతులకు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని ఇప్ప‌టికీ కొంద‌రు భావిస్తుండ‌వ‌చ్చు. కానీ భార‌త్‌లో ఒక టాక్సీ డ్రైవ‌ర్ ను కానీ వీధి వ్యాపారిని కానీ – సెల్ ఫోన్ తో ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌లిగింది ? అని అడిగిన‌ట్ల‌యితే అటువంటి చ‌ర్చ అక్క‌డితోనే ముగిసిపోతుంది. నా దృష్టిలో , టెక్నాల‌జీ అంటే – ఆశ‌లు, అవ‌కాశాల‌కు మ‌ధ్య గ‌ల దూరాన్ని దాటేందుకు వార‌ధి మాదిరిగా ఉప‌యోగించే ఒక సాధనమ‌ని అర్ధం . సామాజిక మాధ్య‌మాలు సామాజిక క‌ట్టుబాట్ల‌ను నిలువ‌రిస్తున్నాయి. మాన‌వ‌తా విలువ‌ల బ‌లం ప్రాతిప‌దిక‌న మాత్ర‌మే అవి మ‌నుషుల‌ను క‌లుపుతున్నాయి త‌ప్ప గుర్తింపు వ‌ల్ల కాదు. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కుల ద్వారా సాధికార‌త‌కు నేడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక ప‌రిజ్ఞానం ఎంత‌గానో తోడ్ప‌డుతోంది. ఇటువంటి టెక్నాల‌జీ అందిస్తున్న డేటా, భారీ స‌మాచారం తో ముడిప‌డిన ప‌నిని స‌మ‌ర్ధంగా నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, 24 గంట‌లకు బ‌దులు కేవ‌లం 24 నిముషాల వ్య‌వ‌ధిలోనే స్పందించ‌డానికి ఆధునిక సాంకేతిక‌త తోడ్ప‌డుతోంది..దీనితో ఆశ‌ల అంచున బ‌తుకుల‌ను వెళ్ల‌దీస్తున్న వారిలో మార్పు తీసుకు రావ‌డం సుసాధ్యమే కాగ‌ల‌దు.ఇటువంటి న‌మ్మ‌కానికి ప్రాణం పోసింది డిజిట‌ల్ ఇండియా ఆలోచ‌న‌. ప్ర‌పంచ మాన‌వాళి చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా భార‌త్‌లో ఇంత పెద్ద ఎత్తున మార్పు తీసుకు వ‌చ్చేయ‌త్నం జ‌రుగుతోంది. దీని ద్వారా దేశంలోని సుదూర ప్రాంతాల‌లో ఉన్న నిరుపేద‌, బ‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌లకు అందుబాటులోకి తీసుకు రావ‌డం మాత్ర‌మే కాదు – మ‌న జీవ‌న విధానాల‌లోను, ప‌నిచేసే తీరులో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. నేడు ప్ర‌జ‌ల సాధికార‌త‌కు సాంకేతిక‌తే అస్త్రం ! 35 ఏళ్ల లోపు వ‌య‌సున్న 80 కోట్ల మంది య‌వత వీట‌న్నింటినీ సాధించాల‌నే త‌ప‌న‌తో ఎదురు చూస్తోంది. మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో కూడిన స‌మ‌ర్ధ పాల‌న‌ను అందించ‌డం
మా ల‌క్ష్యం. ఇప్పుడు నేను మొబైల్ గ‌వ‌ర్న‌న్స్ ( ఎం – గ‌వ‌ర్నెన్ ) గురించి ప్రస్తావిస్తాను. వంద కోట్ల సెల్‌ఫోన్లు,స్మార్ట్ ఫోన్ల వినియోగం ఉన్న దేశంలో చ‌ర‌వాణి ఆధారిత సేవ‌ల‌తో అభివృద్ధిని ఒక ప్ర‌జా ఉద్య‌మంలా మ‌ల‌చేందుకు ఆస్కారం ఉంది. ఇటీవ‌లే నేను న‌రేంద్ర మోదీ మొబైల్ అప్లికేష‌న్‌ను ప్రారంభించి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాను. వారి స‌ల‌హాలు, ఫిర్యాదులు ద్వారా ఎన్నో విష‌యాల‌ను తెలుసుకుంటున్నాను. ప్ర‌తి కార్యాల‌యంలోను కాగిత ర‌హిత వ్య‌వ‌హాల‌కు వీలు క‌ల్పించి ప్ర‌జ‌ల భారాన్ని తగ్గించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. అన్ని ర‌కాల ప‌త్రాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చుకునేందుకు వీలుగా ప్ర‌తి పౌరుడికి ఒక డిజిట‌ల్ లాక‌ర్‌ను నెలకొల్పుతాం. వ్యాపారాలు మ‌రింత‌

సులువుగా చేసేందుకు అనుమ‌తుల మాంజూరు కోసం ఎబిజ్ పోర్ట‌ల్ ఏర్పాటు చేశాం. అభివృద్ధికి కొల‌బ‌ద్ద‌గా వేగ‌వంతం చేసే సాధ‌నంగా డిజిట‌ల్ సాంకేతిక‌త‌ను వినియోగించుకుంటున్నాం. స‌మాచారం, విద్య‌, నైపుణ్యం, ఆరోగ్యం, జీవ‌నోపాధి, ఆర్ధిక వెసులుబాటు, చిన్న‌త‌ర‌హా గ్రామీణ ప‌రిశ్ర‌మ‌లు, మ‌హిళ‌ల‌కు అవ‌కాశాలు, స‌హ‌జ వ‌న‌రుల సంర‌క్ష‌ణ‌, శుద్ధ ఇంధ‌న స‌ర‌ప‌రా వంటి స‌రికొ్త అవ‌కాశాల‌న్నీ కూడా అభివృద్ధి న‌మూనాను మార్చేవిగా ఆవిర్భ‌వించాయి. వీట‌న్నింటి కోసం,మ‌నం డిజిట‌ల్ అగాధం అంత‌రాన్ని త‌గ్గించి అక్ష‌రాస్య‌త కార్య‌క్ర‌మం మాదిరిగానే

డిజిట‌ల్ సాక్ష‌ర‌త‌ను ప్రోత్స‌హించాలి. అంద‌రికీ అందుబాటులో చౌక‌గా, విలువ‌ల‌ను జోడించేదిగా సాంకేతిక‌త ఉండాలి. ఉండేలా చూడాలి. మా దేశంలోని 125 కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను డిజిట‌ల్ విధానంతో అనుసంధించాల‌నేది నా ఆకాంక్ష‌. గ‌త ఏడాది దేశ‌వ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ వినియోగం 63 శాతం పెరిగింది. దీనిని మరింత‌గా పెంచ‌వ‌ల‌సి ఉంది. జాతీయ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ‌లో భాగంగా ఆరుల‌క్ష‌ల గ్రామాల‌కు బ్రాడ్ బ్యాండ్ స‌దుపాయం క‌ల్పించే ప‌థ‌కాన్ని మేం ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ప్రారంభించాం. విమానాశ్ర‌యాల‌లోనే కాకుండా రైల్వే స్టేష‌న్ ప్లాట్ ఫాంల పైనా ఉచిత వై – ఫై సేవ‌ల‌ను విస్త‌రిస్తున్నాం. త్వ‌ర‌లోనే గూగుల్ తో జ‌త‌క‌లిసి మ‌రో 500 రైల్వే స్టేష‌న్ల‌కు
ఈ సేవ‌లు అందిస్తాం. గ్రామాల‌లో ప‌ట్ట‌ణాల‌లో ఉమ్మ‌డి సేవా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డంతో పాటు స్మార్ట్ సిటీల నిర్మాణానికి ఇన్‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీని ఉప‌యోగిస్తాం. గ్రామాల‌ను ఆక‌ర్ష‌ణీయ ఆర్ధిక కేంద్రాలుగా రూపుదిద్దుకునేలా మార్పు చేసి, రైతుల‌కు ఉత్త‌మ మార్కెట్ల‌తో అనుసంధానం క‌ల్పించ‌డం ద్వారా వాతావ‌ర‌ణ క‌ష్టాల‌ను త‌గ్గించుకునే విధంగా త‌యారు చేయాల‌న్న‌ది మా ల‌క్ష్యం. 22 అధికార భాష‌లు ఉన్న భార‌త్‌లో కంప్యూట‌ర్ సేవ‌లు క‌నుక స్థానిక భాష‌ల‌లో ల‌భించిన‌ట్ల‌యితే అవి అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తాయ‌ని నా ఉద్దేశం. ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటు స్థాయిలో ఉత్పత్తుల సేవ‌లు అందించ‌డమే విజ‌యాల‌కు కీల‌కం కాగ‌ల‌దు. ప‌లు కోణాల నుంచి దీనిని చూడాల్సిన అవ‌స‌రం ఉంది.

నాణ్య‌మైన, అందుబాటులో ఉండే ఉత్ప‌త్తుల ఉత్ప‌త్తిని మేం ప్రోత్స‌హిస్తాం. ఇది మేక్ ఇన్ ఇండియా, డిజిట‌ల్ ఇండియా, డిజైన్ ఇండియాల పై మాకున్న విజ‌న్‌లో ఒక భాగమ‌ని చెప్ప‌గ‌ల‌ను. సైబ‌ర్ భ‌ద్ర‌త‌, మేధో హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు మా ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంది. డిజిట‌ల్ ఇండియా విజ‌న్ సాధ‌న కోసం , ప్ర‌భుత్వం కూడా మీలా ఆలోచించ‌డం మొద‌లు పెట్టాలి! సైబ‌ర్ ప్ర‌పంచానికి భార‌త్‌లో అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి. అందువ‌ల్ల‌, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న మొద‌లుకొని, ఉత్ప‌త్తుల త‌యారీ నుంచి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి, డిజిట‌ల్ లిట‌ర‌సీ లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం వంటి లెక్క‌లేన‌న్ని అవ‌కాశాల‌ను మీరు వినియోగించుకోవ‌చ్చు. భారీ ల‌క్ష్యాలు, అనేక స‌వాళ్లు ఉన్నాయి. కొత్త పుంత‌లు తొక్క‌నిదే – కొత్త గ‌మ్యాల‌ను చేరుకోలేమ‌నే విష‌యం మాకు తెలుసు ! మేం క‌ల‌లు కంటున్న భార‌త్ నిర్మాణానికి ఇంకా ఎంతో చేయ‌వ‌ల‌సి ఉంది.మే అనుస‌రించే బాట‌ను రూపుదిద్దుకునే అవ‌కాశం ఇప్పుడు మాకు ల‌భించింది. విజ‌యం సాధించేందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌తిభ , నైపుణ్యాలు మాకు ఉన్నాయి. భార‌త్ – అమెరికాల మ‌ధ్య ధృఢ‌మైన భాగ‌స్వామ్య బ‌లం కూడా మాకు ఉంది. భార‌తీయులు, అమెరిక‌న్లు క‌లిసి క‌ట్టుగా ప‌ని చేసి జ్ఞానాత్మ‌క ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను పెంచ‌డ‌మే కాకుండా సాంకేతికత‌కు ఉన్న అపార‌మైన అవ‌కాశాల‌ను కూడా తెలియచెప్పారు. డిజిట‌ల్ ఇండియా గాధ‌లో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి యువ వృత్తి నిపుణ‌ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావ‌చ్చు. భార‌త్ – అమెరికాలు ఈ శ‌తాబ్ద కాలంలోనే అత్యంత కీల‌క భాగ‌స్వామ్య దేశాలు. వీటి సుస్థిర‌ అభివృద్ధి వ‌ల్ల విశ్వ మాన‌వాళికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. కాలిఫోర్నియాలో ఇరు దేశాలు స‌మ్మిళిత‌మై ఈ శ‌తాబ్ద కాలంలో అత్యంత ప్ర‌ధాన‌మైన భాగ‌స్వామ్య దేశాలుగా నిలిచాయి. ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో చెరో చివ‌ర‌న ఉన్న ఈ ప్ర‌జాస్వామ్య దేశాలు ఈ శ‌తాబ్దానికి ఒక ఆకృతిని క‌ల్పించ‌బోతున్నాయి. యువ శ‌క్తి, సాంకేతిక‌త‌, న‌వ్య ఆవిష్క‌ర‌ణ‌ల ప్రాతిప‌దిక‌న మ‌న రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న సంబంధ బాంధ‌వ్యాలను నిర్వ‌చించారు. దీనితో పాటు, ఈ డిజిట‌ల్ శ‌కంలో మ‌న రెండు దేశాలు కూడా మ‌నకున్న‌ విలువ‌లు, భాగ‌స్వామ్యం ద్వారా ప్ర‌పంచానికి మ‌రింత మెరుగైన , సుస్థిర భ‌విష్య‌త్తు తీర్చిదిద్ద‌గ‌ల‌గాలి.

ధ‌న్య‌వాదాలు !

….