Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌ర‌ల్డ్ సూఫీ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలో వ‌ర‌ల్డ్ సూఫీ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.

పెచ్చరిల్లుతున్న ప్ర‌పంచ ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కోవ‌డంలో సూఫిజం పాత్రను గురించి చ‌ర్చించ‌డానికి ఈ ఫోర‌మ్ ను ద ఆలిండియా ఉలేమా అండ్ మ‌షాయిఖ్ బోర్డు నిర్వ‌హిస్తోంది.

ఉగ్రవాదాన్ని మ‌తం పేరిట ఉప‌యోగించ‌డం, విప్ల‌వీక‌ర‌ణ స‌మ‌స్య‌లకు ఎదురొడ్డి నిల‌వ‌డంలో దీర్ఘ‌కాలిక ప్ర‌త్యామ్నాయాల‌ను ఈ ఫోర‌మ్ చ‌ర్చించనున్నది. ఇందులో ఇస్లామ్ లోని ఆధునిక ఆద‌ర్శ వాదానికి ప్ర‌పంచ కేంద్రాలుగా నిలుస్తున్న దేశాల‌లో భార‌తదేశం కూడా ఒక దేశ‌మ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో పాటు, ఈ విషయాన్ని పున‌రుద్ఘాటించే అవకాశం కూడా ఉంది.

ఈ రోజు మొద‌లై నాలుగు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఈ కార్య‌క్ర‌మంలో, 20 దేశాల నుంచి 200 మందికి పైగా ప్ర‌తినిధులు హాజ‌రు అవుతారని భావిస్తున్నారు. వారిలో ఈజిప్టు, జోర్డాన్‌, ట‌ర్కీ, యునైటెడ్ కింగ్ డ‌మ్‌, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెన‌డా మ‌రియు పాకిస్తాన్ త‌దిత‌ర దేశాల‌కు చెందిన ఆధ్యాత్మిక నాయ‌కులు, పండితులు, విద్యావేత్త‌లు, వేదాంతులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి హ‌జ‌ర‌య్యే సూచ‌న‌లు ఉన్నాయి.

***