Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ‌న్ ర్యాంకు వ‌న్ పెన్ష‌న్ అమ‌లు


వ‌న్ ర్యాంకు వ‌న్ పెన్ష‌న్ (ఒ ఆర్ ఒ పి) అమలు అయ్యేటట్లు కేంద్ర మంత్రిమండలి లాంఛనపూర్వక ఆమోదాన్ని తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్ర‌ధాన‌ మంత్రి అధ్యక్షత వహించారు. వివ‌రాలు ఈ కింది విధంగా ఉన్నాయి..:

1. ప్రయోజనాలను 2014

జులై 1వ తేదీ నుంచి అందజేస్తారు.

2. 2013లో పదవీవిరమణ చేసిన వారికి లభించే కనిష్ఠ మరియు గరిష్ఠ పింఛను యొక్క సగటుకు అనుగుణంగా సమానమైన పదవిలోను, ఇంకా సమానమైన సేవా కాలం ఆధారంగా 2014

జులై 1వ తేదీ కన్నా పూర్వపు పింఛన్ దారులకు పింఛన్ ను తిరిగి ఖరారు చేస్తారు. ఎవ‌రైనా స‌గ‌టు కంటే ఎక్కువ పెన్ష‌న్ ను ఎత్తుతూ ఉంటే, వారికి దానిని య‌థాపూర్వంగా కొన‌సాగిస్తారు.

3. ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాలు యుద్ధంలో మ‌ర‌ణించిన‌ వారి భార్య‌ల‌కు, అంగ‌వైక‌ల్యం పొందిన పెన్ష‌నర్లు సహా కుటుంబ పింఛనును పొందుతున్న‌ వారంద‌రికి కూడా వ‌ర్తిస్తాయి.

4. ఎవ‌రైతే సైనిక సిబ్బంది సైన్య నియమావళి, 1954 లోని 13 (3) 1 (i)(బి), 13(3) 1(iv) నియమం గాని, లేదా 16బి నియమం గాని, లేదా నౌకాదళం యొక్క, లేదా వైమానిక దళం యొక్క సమానమైన నియమాలను అనుసరించి స్వీయ అభ్యర్థన ప్రకారం డిశ్చార్జి అవ్వాలని కోరుకుంటారో, అటువంటి వారికి ఒ ఆర్ ఒ పి ప్రయోజనాలు అందవు. ఇవి ముందు రోజుల నుంచి అమలు అవుతాయి.

5. బకాయి రాశిని ఆరు నెల‌లకు ఒక వాయిదా చొప్పున నాలుగు సార్లుగా చెల్లింపు జరుపుతారు. అయితే, కుటుంబ పింఛన్ దారులకు.. ప్రత్యేక‌/ లిబ‌ర‌లైజ్డ్ ఫ్యామిలీ పెన్ష‌న్‌, మరియు సాహ‌స పురస్కార విజేత‌లు సహా.. బ‌కాయిల‌ను ఒకే వాయిదాలో చెల్లింపు జరుపుతారు.

6. ఇక మీదట, పెన్ష‌న్‌ను ప్ర‌తి ఐదేళ్ళకు ఒకసారి తిరిగి ఖరారు చేస్తారు.

7. 2015 డిసెంబరు 14న పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన జ్యుడీషియల్ కమిటీ భారత ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలపై తన నివేదికను ఆరు నెల‌లలో అంద‌జేయగలదు.

ఒ ఆర్ ఒ పి అమలు వల్ల ర‌క్ష‌ణ బలగాల పింఛన్ దారులకు/ కుటుంబ పింఛన్ దారులకు లభించే పింఛన్ అధికం అవుతుంది. 2015 నవంబరు 7 నాటి ఒ ఆర్ ఒ పి ఉత్తర్వు అమలులో ఏవైనా విపరీతాలు తలెత్తితే వాటిని పరిహరించడంలో జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన జ్యుడీషియల్ కమిటీ తోడ్పడగలదు.

సమయానికన్నా ముందుగానే పదవీవిరమణ పొందిన వారు సహా ఒ ఆర్ ఒ పి అమ‌లు కారణంగా బకాయి రాశి చెల్లింపుల వ్యయం రూ.10,925.11 కోట్లు, ఇంకా సాలుసరి భారం రూ.7,488.7 కోట్లు ఉంటుంది. 2016 మార్చి 31 వరకు రూ.15.91 లక్షల మంది పింఛన్ దారులకు ఒ ఆర్ ఒ పి ఒకటో వాయిదాను చెల్లించారు. ఈ మొత్తం రూ.2,861 కోట్లు. 1.15 లక్షల మంది పింఛన్ దారుల విషయంలో, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రాసెస్ చేయడం కోసం సమాచారాన్ని- పదవీ కాలం అవధిని మదింపు చేయడం వంటి అంశాలలోని అంతరాలను భర్తీ చేసిన అనంతరం- సేకరించడం జరుగుతోంది.