Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం దిశగా భారత్-మారిషస్ ఉమ్మడి ప్రణాళిక


2025, మార్చ్ 11, 12వ తేదీల్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన మారిషస్ అధికార పర్యటన సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రాంగూలాంశ్రీ మోదీల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లోని అన్ని పార్శ్వాల గురించి సమగ్రమైనఫలవంతమైన చర్చలు జరిగాయి.   
మార్చి 11న జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో.. చరిత్రభాషసంస్కృతివారసత్వంబంధుత్వంఉమ్మడి విలువల పరంగా భారత్మారిషస్ ల అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదనిసాటిలేనిదని నేతలిద్దరూ పునరుద్ఘాటించారుఇరుదేశాల ప్రజల మధ్య గల బలమైన సాంస్కృతిక బంధాలే భారత్మారిషస్ ల ప్రత్యేక అనుబంధానికి మూలమని అన్నారు.  గత కొన్ని దశాబ్దాలుగా ఈ అనుబంధం  సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందిందనిఇది వివిధ రంగాలకు విస్తరించి రెండు దేశాలకుప్రజలకువిస్తృత హిందూ మహాసముద్ర ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తోందని వారు విశ్లేషించారు.
మారిషస్ స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచీ దేశ సాంఘికఆర్థిక పురోగతికి… చిరకాల మిత్రదేశంవిశ్వసనీయ భాగస్వామి అయిన భారత్ దన్నుగా నిలిచిందని శ్రీ రాంగూలాం వ్యాఖ్యానించారుభారత్ తమకు అన్నివేళలా అండగా నిలిచిందన్న ఆయనభవిష్యత్తులో ఇరుదేశాలకూ ప్రయోజనం కలిగించే విధంగా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.   
2015 
మార్చిలో తాను చేపట్టిన మారిషస్ పర్యటనను గుర్తు చేసుకున్న భారత ప్రధానివిజన్ సాగర్ (ఆ ప్రాంతంలోని దేశాలన్నిటికీ భద్రతఅభివృద్ధిపేరిట తాను చేసిన ప్రతిపాదన గురించి చెబుతూవిజన్ సాగర్ విజయవంతం అయ్యేందుకు మారిషస్ కీలకమని అన్నారుద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పట్ల మారిషస్ చూపుతున్న నిబద్ధతసహకారాలని కొనియాడారువిజన్ సాగర్…. పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యంగ్లోబల్ సౌత్ కు ప్రాముఖ్యం వంటి భారత కీలక విధానాల్లో మారిషస్ ముఖ్యమైనదనిపరస్పర ప్రయోజనం పొందేందుకూ ఈ విధానాల సాకారానికీ మారిషస్ కీలకమని శ్రీ మోదీ అన్నారు.   
విలక్షణమైనదృఢమైన ద్వైపాక్షిక బంధాల గురించి ప్రస్తావించిన నేతలుఇరుదేశాల మధ్య నెలకొన్న  ప్రత్యేకమైన అనుబంధానికి నూతన దిశ కల్పించి బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా పరివర్తన చేయవలసిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.  

 

రాజకీయ స్థాయిలో
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అనేక స్థాయుల్లో  పరస్పర విశ్వాసంఅవగాహనల ఆధారంగా కొనసాగుతున్నాయనిపరస్పరఉన్నతస్థాయి పర్యటనలు ఈ సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని నేతలిరువురూ అభిప్రాయం వ్యక్తం చేశారుభారత్ జి-20 అధ్యక్షత సమయంలో మారిషస్ అతిథి దేశంగా పాల్గొనడం వల్లఅనేకరంగాల్లో సంబంధాలు మరింత బలపడ్డాయనివీటిని కొనసాగించవలసిన అవసరం ఉందని ఇరువురు నేతలూ అంగీకరించారు.  
ఇరుదేశాల పార్లమెంట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న చర్చలను స్వాగతించిన నేతలుసామర్థ్య పెంపు సహా పార్లమెంటు కార్యకలాపాల్లో అనుసరించదగ్గ ఉత్తమ పద్ధతులను గురించిన సమాచారం పంచుకోవాలనిఇరుదేశాల పార్లమెంటు సభ్యుల మధ్య సంభాషణలని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించారు.  
అభివృద్ధి భాగస్వామ్యం
మారిషస్ కు స్వాతంత్ర్యం లభించిన నాటి నుంచీ భారత్ ముఖ్య అభివృద్ధి భాగస్వామిగా ఉంటూ మౌలిక సదుపాయాలుఇతర అభివృద్ధి పనుల్లో స్థిరమైన సహాయ సహకారాలను అందించిందని ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారుఇండియామారిషస్ మెట్రో ఎక్స్ప్రెస్ ప్రాజెక్ట్నూతన సుప్రీంకోర్టు భవంతికొత్త ఈఎన్ టీ ఆసుపత్రి, 956 గృహాల సముదాయంఎడ్యుకేషన్ టాబ్లెట్లకు సంబంధించిన ప్రాజెక్టుల వంటి అనేక ప్రాజెక్టులలో భారత్ సహాయం మరువలేనిదన్న శ్రీ రాంగూలాంఅనేక ఏళ్ళపాటుగా కొనసాగుతున్న భారత్ సహాయ సహకారాలుఅనేక రంగాలకుదేశ ప్రజలకు లబ్ధి చేకూర్చిందని కృతజ్ఞత వ్యక్తం చేశారు.  

భారత్ సహకారంతో అగలెగాలో నిర్మితమైన కొత్త రన్ వేజెట్టీలు(రేవుకట్టఎంతో ప్రయోజనకరమైనవనిముఖ్యంగా ఇటీవల అగలెగాను అతలాకుతలం చేసిన చిడో తుఫాను నేపథ్యంలోప్రజలకు అత్యవసర సహాయాన్ని అందించడంలో కొత్త సదుపాయాలు కీలకంగా మారాయని ఇద్దరు నేతలు విశ్లేషించారురవాణా విమానాలుఓడలు సహాభారత ప్రభుత్వం అందించిన తక్షణ సహాయంనిర్వాసితుల పునరావాస చర్యల్లో ఎంతో సహాయపడిందని మారిషస్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారుమారిషస్ కు ఎటువంటి సహాయం అవసరమైనాతొలిగా స్పందించే దేశంగా భారత్ మరోసారి తనను తాను నిరూపించుకుందని అన్నారుఅగలెగా అభివృద్ధిలోఅక్కడి ప్రజల సంక్షేమం కోసం చేపట్టే పనుల్లో ఈ సందర్భంగా ఆయన భారత్ సహాయాన్ని అర్థించారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రీనల్ ట్రాన్స్ ప్లాంట్ యూనిట్ఫోరెన్సిక్ ప్రయోగశాలజాతీయ ఆర్కైవ్స్గ్రంథాలయంసివిల్ సర్వీస్ కళాశాలముఖ్యమైన సామాజిక సంక్షేమఅభివృద్ధి ప్రాజెక్టులు కీలకమైనవనివాటిని సకాలంలో పూర్తి చేసేందుకు కృషి కొనసాగిస్తామని నేతలు వెల్లడించారు.  

భారత్ సహాయ సహకారాలు అందించే పలు ప్రజోపయోగ ప్రాజెక్టులు స్నేహమయులైన ఆ దేశ ప్రజలకు కలిగించే ప్రయోజనాల దృష్ట్యానేతలిరువురూ

i. ఒక వంద ఎలక్ట్రిక్ బస్సులతోపాటు వాటికి సంబంధించిన ఛార్జింగ్ సదుపాయాలను కూడా అనుకున్న సమయానికే అందజేయడానికి కృషి చేయాలి.
ii. 
అధిక ప్రభావం చూపే సాముదాయిక అభివృద్ధి పథకాల రెండో దశను అమలుపరచాలి.
iii. 
ఇరు పక్షాల మధ్య కుదిరిన తొలి భారతీయ రూపాయి ఆధారిత రుణ ఒప్పందంలో భాగంగా మారిషస్‌లో 100 కి.మీమేర నీటి గొట్టపు మార్గాన్ని మార్చే పనిని మొదలుపెట్టాలి.
iv. 
మారిషస్ ప్రభుత్వం గుర్తించే ఒక స్థలంలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించే అంశంలో చర్చలకు తుదిరూపాన్ని ఇవ్వాలిఅంతేకాక గ్రాంటు రూపంలో భారత్ అందించే సాయంతో ఈ ప్రాజెక్టును అమలుచేయడానికి ఒక విధివిధానాలపై అంతిమ అవగాహనకు రావాలి.
v. 
గంగా సరస్సు ఆధ్యాత్మిక అభయారణ్యాన్ని సరికొత్తగా అభివృద్ధి పరిచే విషయంలో చర్చలను ముగించిగ్రాంటు రూపంలో భారత్ అందించే సాయంతో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఒక విధివిధానాలపై అంతిమ అవగాహనకు రావాలి.
vi. 
మారిషస్ ప్రభుత్వ అవసరాలుప్రాథమ్యాల ప్రకారం అభివృద్ధి ప్రధాన సహకారానికి కొత్త రంగాలను అన్వేషించాలి.

మానవ వనరులను అభివృద్ధిసామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు
12. భారత్ ఎల్లప్పుడూ మారిషస్‌కు సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాల్లోశిక్షణ కార్యక్రమాలతోపాటు మానవ వనరుల అభివృద్ధి అవసరాలను తీర్చడంలో తన తోడ్పాటును అందిస్తూ వచ్చిన విషయాన్ని పరిశీలనలోకి తీసుకొనినేతలిద్దరూ ఈ కింది అంశాల్లో తమ నిబద్ధతను వ్యక్తం చేశారు:

i. భారత ఐటీఈసీ ఫ్రేంవర్క్ కు సంబంధించిన కార్యక్రమాలుప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు.. ఈ రెండిటిలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న ‘సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాల’ను కొనసాగించడంమారిషస్‌కు చెందిన 500 మంది ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అయిదు సంవత్సరాల పాటు భారత్‌లో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్‌సీజీజీదన్నుతో నిర్వహించడం.  
ii. 
అత్యుత్తమ పద్ధతులను పంచుకోవడానికిసహకారాన్ని ఇకమీదటా కొనసాగించడానికి సివిల్ సర్వీస్ కాలేజీఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీనేషనల్ ఆర్కైవ్స్లైబ్రరీలకు మధ్య భారత్‌లోని సంబంధిత ప్రధాన సంస్థలతో సంస్థాగత సంబంధాలను ఏర్పరచడం.
iii. 
మారిషస్ ప్రభుత్వానికి నిర్వహణ సంబంధిత అవసరాలను తీర్చడానికి కన్సల్టెంట్లుసాంకేతిక నిపుణులను ప్రతినిధులుగా పంపించడంలో సహకారాన్ని ఇకముందూ కొనసాగించడం.
iv. 
ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొని సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు సంస్థాగత రూపునిచ్చి మారిషస్ దౌత్యవేత్తలకు సుష్మా స్వరాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్‌లో ఇప్పటికే అమలుచేస్తున్న శిక్షణ సంబంధిత సహకారాన్ని మరింత పెంచడంతోపాటు బలోపేతం చేయడం.
v. 
మారిషస్ అవసరాలుప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకొనిసివిల్పోలీసుపారామిలటరీకస్టమ్స్చట్ట వ్యవస్థఆరోగ్య రంగంతదితర రంగాల్లో మారిషస్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలను ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా నిర్వహించేందుకు అవకాశాలను పరిశీలించడం.  

అంతరిక్ష రంగంవాతావరణ మార్పు
అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారం ఎంతో ప్రయోజనకరంగా ఉందనిఇది మారిషస్‌తో తనకున్న ప్రత్యేక సంబంధాలకు భారత్ కట్టబెడుతున్న ప్రాముఖ్యానికి అద్దంపడుతోందని నేతలు ఇరువురూ అంగీకరించారుమారిషస్ కోసం ఒక ఉపగ్రహాన్ని సంయుక్తంగా రూపొందించే పనిలో భారత్ సహకారాన్ని అందిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి మారిషస్ ప్రధాని అభినందనలు తెలిపారుఈ సహకారం మారిషస్ అభివృద్ధి ప్రస్థానంలో భారత్ అందిస్తున్న దృఢమైన మద్దతుకు ఒక నిదర్శనంగా ఉందని కూడా ఆయన అన్నారు.

అంతరిక్ష రంగంలో సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈ కింది అంశాలపై వారు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు:
i. 
మారిషస్‌ శాస్త్రవేత్తలకునిపుణులకు అవసరమైన శిక్షణను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అందజేయడం సహా భారత్మారిషస్ ఉపగ్రహానికి విజయవంతంగా రూపకల్పన చేయడంతోపాటు ఆ ఉపగ్రహాన్ని ప్రయోగించే దిశగా కలిసి పనిచేయాలి.

ii. మారిషస్‌లో వివిధ కాలాల్లో వాతావరణ ముందస్తు సూచన ప్రణాళికలనువేవ్ రైడర్ బాయస్బహుళ ఆపదల వేళల్లో అనుసరించదగ్గ అత్యవసర ప్రణాళికలను అమలుపరచడంలో సాయం చేయాలిదీనివల్ల విపత్తులను దీటుగా ఎదుర్కోవడానికిప్రతిస్పందన వ్యవస్థను రూపొందించుకోవడానికి మారిషస్‌కు అండదండలు లభిస్తాయి.
iii. 
మారిషస్‌లో ఏర్పాటు చేసిన ఇస్రో టెలిమెట్రీట్రాకింగ్ సెంటర్‌లో ఇస్రోకుమారిషస్ రిసర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (ఎంఆర్ఐసీ)కి మధ్య ప్రస్తుతం అమలవుతున్న సహకారాన్ని పునరుద్ధరించుకోవాలి.
iv. 
మారిషస్ అవసరాలను తీర్చడానికి అంతరిక్ష రంగంవాతావరణ మార్పు రంగం.. ఈ రెండు రంగాలలో సహకరించుకొనేందుకు కొత్త అవకాశాలను పరిశీలించాలిదీనికి సంబంధించిన సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలకు మద్దతివ్వాలి.
v. 
ఎర్త్ అబ్జర్వేషన్ అప్లికేషన్‌తోపాటు ఇంటరాక్టివ్ కంప్యూటింగ్ ఫ్రేంవర్క్‌.. వీటిని ఉపయోగించుకొనే లక్ష్యంతో ఒక అభివృద్ధి ప్రధాన భాగస్వామ్య ప్రాజెక్టును మొదలుపెట్టాలన్న భారత ప్రభుత్వ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవాలిఈ ప్రాజెక్టు ఉద్దేశం మారిషస్‌లో తీవ్ర వాతావరణ ఘటనలను పర్యవేక్షించడంతోపాటు వాతావరణ మార్పులు ప్రసరించే ప్రభావాలను కూడా సమర్థంగా అధ్యయనం చేయడంఈ ప్రాజెక్టును క్వాడ్ ఛత్రఛాయలో ఇస్రోభూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్నిర్వహిస్తాయి.   

ఆరోగ్యంవిద్యారంగాల్లో సహకారం
భారత ఆరోగ్యరంగ డీపీఐలుప్లాట్‌ఫామ్‌ల ద్వారా మారిషస్ అభివృద్ధికి సహకరించడం సహా ఆరోగ్యంవిద్యారంగాల్లో మౌలికసదుపాయాల అభివృద్ధికి భారత్ అందించిన మద్దతును ప్రధానంగా ప్రస్తావిస్తూమారిషస్ ప్రజల కోసం నాణ్యమైనసరసమైనఅందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను అందించడం పట్ల తమ నిబద్ధతను ఇరు దేశాల ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారుభారత జన్ ఔషధీ కేంద్రాలను విదేశాల్లో తొలిసారిగా మారిషస్‌లో ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఇరువురు నేతలుదేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ కేంద్రాలను విస్తరించనున్నట్లు తెలిపారు.

పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగంసంబంధిత సామాజిక సమస్యల సవాళ్ల నేపథ్యంలో పునరావాస కేంద్రాల ఏర్పాటు ద్వారా ఈ దురవాట్లను రూపుమాపేందుకు కలిసి పనిచేయనున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారుఅలాగే భారత మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ నైపుణ్యాలుసహకారం అండగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమష్టిగా పనిచేస్తామని వారు తెలిపారు.  
మారిషస్‌లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటలైజ్ చేయుటలో సహాయం అందించడం కోసం భారత్ నుంచి ఒక నిపుణుడి సేవలను డిప్యుటేషన్ ద్వారా వినియోగించుకోవడంతో పాటు మారిషస్‌లో డిజిటల్ హెల్త్ కార్యాలయ వ్యవస్థను ప్రారంభించడం ద్వారా ఆరోగ్య రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు ఇరువురు ప్రధానులు తెలిపారు.
ఆయుష్ రంగంలో సహకారం ప్రాముఖ్యతను ఇరువురు నేతలు ప్రధానంగా ప్రస్తావించారుమారిషస్‌లో ఆయుష్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటులో మద్దతునిస్తున్న భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞలు తెలిపిన మారిషస్ ప్రధానమంత్రిఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు విషయంలో భారత్ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆకాంక్షించారుఅలాగే భారత్‌లో చికిత్స పొందుతున్న మారిషస్ పౌరులకు భారత్ అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు.
పాఠశాల విద్య అభివృద్ధి కోసం మెరుగైన పాఠ్యప్రణాళిక రూపకల్పనలో పరస్పర సహకారానికై నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఎన్‌సీఈఆర్‌టీ), మారిషస్ ఉన్నత విద్యాశాఖ మధ్య కొనసాగుతున్న చర్చలను స్వాగతించిన ఇరువురు ప్రధానులుఈ సహకారం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పాఠశాల విద్యారంగంలో సంస్థాగత సంబంధాలనూ బలోపేతం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారునేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యూహం అమలు కోసం ప్రణాళికను సిద్ధం చేయడంమారిషస్‌లో డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్థాపన సహా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ – మారిషస్ బంధాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు వారు తెలిపారు.

ఆర్థికవాణిజ్య సహకారం
ఆఫ్రికా ప్రాంతంలోని దేశంతో భారత్ చేసుకున్న మొట్టమొదటి వాణిజ్య ఒప్పందమైన సమగ్ర ఆర్థిక సహకారం– భాగస్వామ్య ఒప్పందం (సీఈసీపీఏను ఇరుదేశాల ఆర్థికవాణిజ్య సంబంధాల్లో కీలక మైలురాయిగా అభివర్ణించిన ఇరువురు నేతలుతమ ఉమ్మడి లక్ష్యమైన ఆర్థిక వృద్ధిశ్రేయస్సు కోసం ఇరుదేశాలు ద్వైపాక్షిక వాణిజ్య సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారుఇతర అంశాలతో పాటుమారిషస్‌కు గల ప్రాదేశిక ప్రయోజనంసాంస్కృతిక సంబంధాలను గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆ దేశ ప్రధానమంత్రిఆఫ్రికా ఖండ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం (ఏఎఫ్‌సీఎఫ్‌టీఏ)లో భాగంగా ఉన్న మారిషస్‌ను భారత కంపెనీలువ్యాపారులు ఆఫ్రికాతో భారత్ సంబంధాలకు వారధిగా ఉపయోగించుకునిఆఫ్రికా అందించే వాణిజ్యవ్యాపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యవ్యాపార సంబంధాలను విస్తృతం చేయడం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూఇరువురు నేతలు కింది అంశాల్లో పరస్పర సహకారం కోసం ఏకాభిప్రాయానికి వచ్చారు:
i. 
ఇరు దేశాల మధ్య వాణిజ్యఆర్థిక సహకారంభాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం సీఈసీపీఏ కింద ఉన్నత స్థాయి సంయుక్త వాణిజ్య కమిటీ రెండో సమావేశాన్ని నిర్వహించడం.
ii. 
ఇరు దేశాల భాగస్వామ్య సెంట్రల్ బ్యాంకులు స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ గురించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా భారతమారిషస్ కరెన్సీలను మాత్రమే ఉపయోగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీల నిర్వహణను సులభతరం చేయడం.
iii. 
ప్రస్తుత చర్చల అనంతరంఒప్పంద దుర్వినియోగానికి సంబంధించి  అమలులో ఉన్న రెట్టింపు పన్ను విధానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించే ప్రోటోకాల్‌ను సాధ్యమైనంత త్వరగా ఆమోదించడం.
iv. 
దీర్ఘకాలికసుస్థిర ఆర్థిక వృద్ధి కోసం మారిషస్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సముద్ర ఆర్థిక వ్యవస్థఫార్మాస్యూటికల్స్ఐటీఫిన్‌టెక్ వంటి అబివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం.  
డిజిటల్ సహకారం
పెద్ద సంఖ్యలో జనాభాను దృష్టిలో ఉంచుకుని భారత్ రూపొందించిన డిజిటలైజేషన్ కార్యక్రమాలు సాధించిన విజయాలుపరిపాలనసేవారంగాల్లో వాటి సానుకూల ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించిన మారిషస్ ప్రధానమంత్రితమ దేశంలో వివిధ రంగాల డిజిటలైజేషన్ కోసం భారత్ సహకారాన్ని అభ్యర్థించారుఈ అభ్యర్థనకు స్పందించిన భారత ప్రధానమంత్రి ఈ విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారుదీనికి అనుగుణంగా ఇరువురు నేతలు కింది అంశాల్లో సహకారం కోసం ఏకాభిప్రాయానికి వచ్చారు:
i. 
మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్‌లో ఈజ్యుడీషియరీ వ్యవస్థ అమలు సహా ప్రాచీన పత్రాలురికార్డుల డిజిటలైజేషన్‌కు సహకారం అందించడం.
ii. 
సైబర్ భద్రతడిజిటల్ ప్రజా మౌలికసదుపాయాలుసామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమాలు సహా ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడం.
iii. 
భారత్ రూపొందించిన పీఎమ్ గతి శక్తి డిజిటల్ ప్లాట్‌ఫామ్ వంటి విజయవంతమైన డిజిటల్ సాధనాలను మారిషస్ అవసరాలకు అనుగుణంగా అమలు చేయు మార్గాలను అన్వేషించడం.  

రక్షణసముద్ర భద్రతా సహకారం

రక్షణసముద్ర భద్రతా సహకారం ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఉందనిఈ రంగంలో సన్నిహిత సహకారం వ్యూహాత్మక మార్పుతో రెండు దేశాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని ఇరువురు నేతలు గుర్తించారుస్వేచ్ఛాయుతబహిరంగసురక్షితమైన హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని నిర్ధారించడానికి భాగస్వామ్య నిబద్ధతను కలిగి ఉన్న మారిషస్భారతదేశం ఈ ప్రాంతంలో సహజ భాగస్వాములుగా అభివర్ణించారుసముద్ర సంబంధ సవాళ్లను ఎదుర్కోవడంలోనూఈ ప్రాంతంలో విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను రక్షించడంలోనూ కలిసి పనిచేయాలనే తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

తమ విస్తృత ప్రత్యేక ఆర్థిక మండలాన్ని (ఇఇజడ్ రక్షించడంలో అచంచలమైన మద్దతు అందిస్తున్నందుకు భారతదేశానికి మారిషస్ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారురక్షణసముద్ర ఆస్తులను సమకూర్చడంనౌకలువిమానాలను క్రమానుసార మోహరింపుఉమ్మడి సముద్ర పర్యవేక్షణహైడ్రోగ్రాఫిక్ సర్వేలుపర్యవేక్షణద్వైపాక్షికవిన్యాసాలుసమాచారం పంచుకోవడంశిక్షణపరంగా మద్దతు వంటి చర్యల ద్వారా మారిషస్‌కు భారత్ ప్రధాన భద్రతా ప్రదాతగా అవతరించింది.

తీర రక్షణ నౌకలు విక్టరీవాలియంట్ బారకుడా పునరుద్ధరణకు భారతదేశం అందిస్తున్న నిరంతర సహాయానికి కూడా మారిషస్ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారుభారత ప్రధానమంత్రి మాట్లాడుతూ… మారిషస్ భారతదేశానికి ప్రత్యేక సముద్ర భాగస్వామి అనిభారతదేశ విజన్ సాగర్ (ప్రాంతంలో అందరికీ భద్రతవృద్ధికింద ఒక ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. . ప్రాంతంలో ఉమ్మడి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకునిమారిషస్ రక్షణభద్రతా అవసరాలను పెంపొందించడంలో భారతదేశం తన నిరంతర మద్దతునుసహాయాన్ని కొనసాగిస్తుందని భారత ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

ఈ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తమ ఉమ్మడి ఆకాంక్షను పునరుద్ఘాటించిన నాయకులు ఈ విధంగా తీర్మానించారు:

i. మారిషస్ అవసరాలుప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకునిరక్షణసముద్ర ఆస్తులుసామగ్రిని అందించడంలో సహకారాన్ని కొనసాగిచడం.

ii. సంయుక్త సముద్ర నిఘాహైడ్రోగ్రఫీ సర్వేల కోసం నౌకలు,విమానాల మోహరింపును పెంచడం ద్వారా సముద్ర సహకారాన్ని పెంపొందించడం.

iii. అగలేగా ద్వీపంలో కొత్తగా నిర్మించిన రన్ వేజెట్టీని మరింత ఉపయోగించుకోవడంతో సహా మారిషస్ ఈఈజెడ్ ను సురక్షితంగా ఉంచే దిశగా సహకారాన్ని పెంపొందించుకోవడం.

iv. సముద్ర పరిధిపై అవగాహనను పెంపొందించేందుకు సముద్ర సమాచారాన్ని పంచుకునే జాతీయ కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించడం.

v. మారిషస్ పోర్ట్ అథారిటీకి సముద్ర కార్యకలాపాలుమెరైన్ ఇంజనీరింగ్పోర్ట్ భద్రతా బాధ్యత పోర్ట్ అత్యవసర పరిస్థితులు పోర్ట్ రక్షణ రంగాలలో నైపుణ్యాన్ని అందించడం ద్వారా సహకరించడం.

vi. మారిషస్ పోలీస్ బలగాల పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకుశిక్షణా కార్యక్రమాలుసామర్థ్య పెంపు చర్యలను చేపట్టడం.

ప్రాంతీయబహుపాక్షిక సహకారం

చాగోస్ దీవులపై ప్రస్తుతం మారిషస్బ్రిటన్ యునైటెడ్ మధ్య జరుగుతున్న చర్చలను ఇద్దరు నాయకులు స్వాగతించారుచాగోస్ సమస్యపై మారిషస్‌కు భారత్ దృఢమైన మద్దతును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారుఈ విషయంలో భారత ప్రధాని వ్యక్తిగత మద్దతు ఇవ్వటమే కాకుండా ప్రపంచ నాయకులతో ఆయన నేరుగా చర్చించడం పట్ల మారిషస్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యంగా హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ (ఐఓఆర్ఏ), కొలంబో సెక్యూరిటీ కాన్ క్లేవ్ గ్లోబల్ బయోఫ్యూయెల్స్ అలయన్స్ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కూటమి ద్వారా ప్రాంతీయబహుపాక్షిక యంత్రాంగం కింద సహకారాన్ని పెంపొందించడంలో కలిసి పనిచేయడానికి నాయకులు అంగీకరించారుకొలంబో భద్రతా సదస్సు వ్యవస్థాపక పత్రాలపై ఇటీవల సంతకం చేయడాన్ని, 2025-26 కాలానికి ఐఓఆర్ఏ అధ్యక్ష పదవిని భారత్ చేపట్టడాన్ని వారు స్వాగతించారుసముద్ర భద్రతపై సహకారాన్ని పెంపొందించడానికిహిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉమ్మడి సవాళ్లను పరిష్కరించడానికి ఈ ప్రాంతీయ యంత్రాంగాల ప్రాముఖ్యతను వారు గుర్తించారు.

సాంస్కృతికప్రజల మధ్య సంబంధాలు

సాంస్కృతిక వారసత్వంచారిత్రక సంబంధాలుప్రజల మధ్య సంబంధాలు రెండు దేశాల ప్రత్యేక సంబంధాలకు ఆధారంగా ఉన్నాయని గుర్తిస్తూవీటిని మరింత బలోపేతం చేయాలని ఇద్దరు నాయకులు అంగీకరించారుఈ దిశగా కింది చర్యలను చేపట్టాలని తీర్మానించారు.

i. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రత్యేక శిక్షణసంస్థాగత మద్దతుతో సహా భారతదేశానికి చెందిన ఒప్పంద కార్మికుల డాక్యుమెంట్ రికార్డులను భద్రపరచడంలో మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ కు మద్దతు.

ii. భారత్ ను గురించి తెలుసుకునే కార్యక్రమంకలిపే మార్గాలుప్రవాసీ భారతీయ దివస్స్కాలర్ షిప్ ల ద్వారా ప్రవాస భారతీయులతో సంబంధాలను బలోపేతం చేయడంగిర్మిత్య వారసత్వానికి సంబంధించిన పరిశోధనప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో వారి వారి పాత్రను అక్షరబద్ధం చేయడం.

iii. చార్ ధామ్రామాయణ మార్గాలతో పాటు భారతదేశంలోని పురాతనమత ప్రార్థనా స్థలాల సందర్శనల ద్వారా పర్యాటకసాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించడం.

iv. మారిషస్భారతదేశం మధ్య కార్మిక నియామక అవగాహన ఒప్పందం (ఎంఒయుఅమలును వేగవంతం చేయడం ద్వారా రెండు దేశాల మధ్య కార్మికుల రాకపోకల్ని సులభతరం చేయడం:

మొత్తం ద్వైపాక్షిక సంబంధాలపై తమ సమగ్ర చర్చల పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారుతమ ప్రత్యేక సన్నిహిత ద్వైపాక్షిక భాగస్వామ్యం గణనీయమైన వ్యూహాత్మక స్థాయికి చేరిందని అంగీకరించారుఅభివృద్ధి భాగస్వామ్యంరక్షణసముద్ర భద్రతప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారానికి మారిషస్భారత్ ద్వైపాక్షిక భాగస్వామ్యం ప్రకాశవంతమైన ఉదాహరణ అనిఈ ప్రాంతంలో ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఒక ప్రామాణికాన్ని ఏర్పరుస్తుందని వారు పేర్కొన్నారురెండు దేశాల సంబంధాలను పరస్పర ప్రయోజనకరంగామారిషస్ అభివృద్ధి అవసరాలను తీర్చేలాప్రాంత ఉమ్మడి లక్ష్యాలకు దోహదపడేలా మరింత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చడానికి మార్గదర్శకత్వంమార్గనిర్దేశం అందించడానికి రెండు దేశాల నేతలు అంగీకరించారు.

మారిషస్ స్వాతంత్ర్యం 57వ వార్షికోత్సవంమారిషస్ రిపబ్లిక్ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరైనందుకు మారిషస్ ప్రధానమంత్రి భారత ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

వీలైనంత త్వరగా భారత పర్యటనకు రావాలని మారిషస్ ప్రధానిని భారత ప్రధాని ఆహ్వానించారు.

 

***