వ్యాపారం, వాణిజ్యం మరియు రవాణా పై భారతదేశం, భూటాన్ ల మధ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
భారతదేశం, భూటాన్ ల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు వ్యాపారం, వాణిజ్య మరియు రవాణా అంశాలపై భారత ప్రభుత్వం, భూటాన్ లు కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా అదుపులో ఉంటాయి. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వ్యాపార విధానానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా తృతీయ పక్షం దేశాలతో వ్యాపారం జరపడానికిగాను భూటాన్ కు చెందిన సరుకులు సుంకం లేకుండా ప్రయాణించేందుకు కూడా ఈ ఒప్పందం వెసులుబాటును కల్పిస్తుంది.
10 సంవత్సరాల కాలం పాటు అమలయ్యేటట్లు 2006 జులై 29 నాడు ఒప్పందాన్ని పునర్ నవీకరించారు. ఈ ఒప్పందం చెల్లుబాటు గడువును 2016, జులై 29 నుండి ఒక సంవత్సరం పాటు గాని, లేదా నూతన ఒప్పందం అమలులోకి వచ్చేంటత వరకు గాని- దౌత్యపరమైన పత్రాల మార్పిడి ద్వారా- పొండిగించడమైంది.
భారతదేశం, భూటాన్ ల మధ్య విశ్వాసం, ఇంకా అవగాహనల ప్రాతిపదికన ఏర్పడిన విశిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు కాలక్రమంలో పరిణతి చెందాయి. వ్యాపారం, వాణిజ్యం మరియు రవాణా ఒప్పందం ఆచరణలోకి రావడంతో ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.