Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘వోకల్ఫార్ లోకల్’ కు సమర్థన ఇవ్వవలసింది గా పౌరుల కు విజ్ఞప్తిచేసిన ప్రధాన మంత్రి


డిజిటల్ మీడియా ను ఉపయోగించి స్థానిక ప్రతిభ కు సమర్థన ను ఇవ్వడం ద్వారా భారతదేశం యొక్క నవ పారిశ్రామికత్వాన్ని మరియు సృజనాత్మక భావన ను ఒక వేడుక గా జరుపుకోవలసిందంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజల కు ఈ రోజు న విజ్ఞప్తి చేశారు.

ఒక ఉత్పాదన తో లేదా ఆ ఉత్పాదన తయారీదారు తో ఒక సెల్ఫీ ని తీసుకొని నమో ఏప్ (NaMo app) లో పోస్ట్ చేయడాని కి వీలు గా ఒక లింకు ను కూడా ఆయన శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్టు చేసిన ఒక సందేశం లో-

‘‘రండి, ఈ దీపావళి కి మనం ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానిక ఉత్పాదనల కు ప్రాధాన్యాన్ని ఇవ్వడం) తాలూకు అభిప్రాయాల ను నమో ఏప్ లో వెల్లడించడం ద్వారా భారతదేశం యొక్క నవ పారిశ్రామికత్వ భావన ను మరియు సృజనాత్మకమైన భావన ను ఓ వేడుక గా జరుపుకొందాం.

narendramodi.in/vocal4local

రండి, స్థానికం గా తయారు చేసినటువంటి ఉత్పాదనల ను కొని, మరి ఆ ఉత్పాదన తో గాని లేదా ఆ వస్తువు ను తయారు చేసిన వారి తో గాని సెల్ఫీ ని తీసుకొని నమో ఏప్ లో పోస్ట్ చేయగలరు. మీ మీ పోస్టుల లో పాలుపంచుకోవడాని కి ముందు కు రావలసిందంటూ మీ కుటుంబాన్ని మరియు మీ మిత్రుల ను ఆహ్వానించడం తో పాటు గా సకారాత్మకత యొక్క భావన ను కూడా వ్యాప్తి చేద్దాం.

 

రండి, స్థానిక ప్రతిభ కు సమర్థన ను ఇవ్వడం కోసం, సాటి భారతదేశ పౌరుల సృజనాత్మక కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం మరియు మన సంప్రదాయాలు వర్థిల్లేటట్లుగా చూడడం కోసం మనం డిజిటల్ మీడియా తాలూకు శక్తి ని ఉపయోగించుకొందాం.’’ అని పేర్కొన్నారు.

****

DS/RT