గాంధీనగర్ లోని మహాత్మ మందిర్ ఎగ్జిబిశన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ లో వైబ్రంట్ గుజరాత్ సమిట్ యొక్క తొమ్మిదో సంచిక రేపు ప్రారంభం కానుంది. గుజరాత్ లో పెట్టుబడుల కు ఊతాన్ని ఇవ్వడమే ధ్యేయం గా ఉన్నటువంటి ఈ శిఖర సమ్మేలనం యొక్క ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.
జనవరి 18-20 తేదీ ల మధ్య ఆరంభం కావలసి వున్న వైబ్రంట్ గుజరాత్ సమిట్ కు ముందు గా గ్లోబల్ ట్రేడ్ శో ను ఎగ్జిబిశన్ సెంటర్ లో ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఆయన వివిధ పెవిలియన్ లను సందర్శించారు. ఈ సందర్భం గా ప్రధాన మంత్రి తన ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికత కు తగ్గట్లు ‘చరఖా నుండి చంద్రయాన్ దాకా’ అనే సముచితమైన ఉప శీర్షిక తో ఏర్పాటైన ఐఎస్ఆర్ఒ, డిఆర్‌డిఒ, ఖాదీ తదితర స్టాల్స్ పట్ల కుతూహలాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంట గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ, ఇంకా ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 2,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణం లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ట్రేడ్ శో లో 25 కు పై చిలుకు స్టాల్స్ లో పలు ఉత్పత్తుల ను, ఆలోచనల ను, మరియు ఆకృతుల ను పారిశ్రామిక రంగం, వ్యాపార రంగం ఒకే చోట ప్రదర్శిస్తున్నాయి.
సమిట్ తో పాటే పలు కార్యక్రమాల ను కూడా నిర్వహిస్తున్నారు. నేటి ప్రధాన ఆకర్షణల లో ఒకటైన అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్- 2019 ని ప్రధాన మంత్రి సాయంత్రం పూట ప్రారంభించనున్నారు. ఈ సందర్భం గా వైబ్రంట్ గుజరాత్ అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్ యొక్క మాస్కట్ ను ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారు. భారతదేశం లో ఈ తరహా కార్యక్రమాల లో అహమదాబాద్ శాపింగ్ ఫెస్టివల్- 2019 మొదటిది. ఇది నగరం లోని సంస్థ లకు వాటి ఉత్పత్తుల ను ప్రదర్శించేందుకు ఒక అవకాశాన్ని అందిస్తోంది.
వైబ్రంట్ గుజరాత్ లో భాగం గా నిర్వహిస్తున్న ప్రధానమైన కార్యక్రమాల కు తోడు, ప్రాతినిధ్య పక్షాల మధ్య నెట్ వర్కింగ్ స్థాయి ని ముమ్మరం చేసేందుకు మరియు జ్ఞానాన్ని పరస్పరం పంచుకొనేందుకు సరికొత్త శ్రేణి వేదికల ను ఈ శిఖర సమ్మేళనం తొమ్మిదో సంచిక అందుబాటు లోకి తీసుకురానుంది.
పూర్వరంగం:
పెట్టుబడులకు గమ్య స్థానం గా గుజరాత్ ను పున:ప్రతిష్ఠితం చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్రాని కి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు- 2003వ సంవత్సరం లో- వైబ్రంట్ గుజరాత్ సమిట్ ఆలోచన చేశారు. సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల పై చర్చ లు జరిపేందుకు ఒక వేదిక గాను, జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం తో పాటు ప్రభావశీల భాగస్వామ్యాల ను ఏర్పరచుకొనేందుకు ఈ శిఖర సమ్మేళనం ఒక వేదిక ను సమకూర్చనుంది.
వైబ్రంట్ గుజరాత్ 2019 యొక్క ప్రధానాంశాలలో-
1. భారతదేశం లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాపం, ఇంజినీరింగ్, ఇంకా గణిత (ఎస్‌టిఇఎమ్) విద్య & పరిశోధన రంగాల లో అవకాశాల కు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి గా ఉంటుంది. ‘‘రోడ్ మ్యాప్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎస్‌టిఇఎమ్ ఎడ్యుకేశన్ & రిసర్చ్ ఇన్ ఇండియా’’ ను సిద్ధం చేసేందుకుగాను ఈ సమావేశాని కి భారత ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వాల లో కీలకమైన విధాన రూపకర్తలు గా ఉన్న వారితో పాటు ప్రముఖ విద్యావేత్తలు కూడా హాజరు కానున్నారు.
2. ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమెటిక్స్ (ఎస్‌టిఇఎమ్) మరొకటి గా ఉంటుంది.
3. భావి తరం సాంకేతిక విజ్ఞానం మరియు అంతరిక్ష అన్వేషణ అంశాల పైన ప్రదర్శన ఇంకొకటి గా ఉంటుంది.
4. ఆసియా యొక్క ట్రాన్స్-శిప్‌మెంట్ హబ్ గా భారతదేశాన్ని నిలబెట్టేందుకు ఓడ రేవుల నేతృత్వం లో అభివృద్ధి సాధన, ఇంకా వ్యూహాల పైన చర్చాసభ కూడా ఉంటుంది.
5. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం తాలూకు విజయ గాథ లను కళ్లకు కట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలకమైన కార్యక్రమాల పై ఒక చర్చాసభ ను నిర్వహించనున్నారు.
6. గుజరాత్ లో రక్షణ, ఇంకా ఏరోనాటిక్స్ రంగాల లో గల అవకాశాల ను గురించి ఆహుతుల కు వివరించడం కోసం మరియు రక్షణ రంగం లో, ఏరోనాటిక్స్ లో తయారీ కేంద్రాలు గా గుజరాత్, భారతదేశం ఆవిర్భవించేందుకు అనుసరించవలసిన మార్గం అనే అంశం పైన చర్చించడం కోసం మరొక సెమినార్ ఉంటుంది.
2003వ సంవత్సరం లో వైబ్రంట్ గుజరాత్ సమిట్ ఆరంభమైనప్పటి నుండి, అనేక రాష్ట్రాలు తాము సైతం వ్యాపారాని కి, పెట్టుబడుల కు ఊతాన్ని అందించడం కోసం ఈ కోవ కు చెందిన శిఖర సమ్మేళనాల ను నిర్వహించేటట్లుగా ఈ సమిట్ ఒక ఉత్ప్రేరకం గా పనిచేసింది.
**