Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైద్యుల జాతీయ దినోత్సవం నేపథ్యంలో వైద్య సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు


   వైద్యుల జాతీయ దినోత్సవం సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశంలోని యావత్‌ వైద్య సమాజానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“నేడు వైద్యుల జాతీయ దినోత్సవం #DoctorsDay నేపథ్యంలో దేశంలోని వైద్య సమాజానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం వైద్యులు అత్యున్నత స్థాయి సాహసం, నిస్వార్థం, సానుకూల దృక్పథానికి ఉదాహరణగా నిలుస్తారు. వైద్యసేవను మించిన వారి అంకితభావం మన సమాజంలో ఆశాభావాన్ని, శక్తిని ఇస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS