ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ‘‘వైద్యపరంగా గర్భస్రావం (సవరణ) బిల్లు-2020కు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ‘‘వైద్యపరంగా గర్భస్రావ చట్టం-1971’’ అమలు లో ఉన్న నేపథ్యం లో దీన్ని సవరించే దిశ గా మంత్రిమండలి తాజా బిల్లు ను ఆమోదించింది. ఈ సవరణ బిల్లు ను రానున్న పార్లమెంటు సమావేశాల సందర్భం గా ప్రభుత్వం సభ లో ప్రవేశపెట్టనుంది.
ప్రతిపాదిత సవరణలో ముఖ్యాంశాలు:
• గర్భస్థ పిండం 20 వారాల దశ లో ఉన్నపుడు ఒక వైద్యసేవా ప్రదాత (వైద్య నిపుణుడు) అభిప్రాయం తో వైద్యపరం గా గర్భస్రావం చేసేందుకు ఇప్పటిదాకా వీలుంది. ఈ నేపథ్యం లో గర్భస్థ పిండదశ వ్యవధిని 20-24 వారాల కు పెంచడంతోపాటు వైద్యపరం గా గర్భస్రావాని కి ఇద్దరు వైద్య నిపుణుల అభిప్రాయాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజా సవరణను ప్రతిపాదించింది.
• ప్రత్యేక వర్గం మహిళల విషయం లో 20 నుంచి 24వారాల కు పెంచిన గర్భస్థ పిండ దశ వ్యవధి గురించి వైద్యపరం గా గర్భస్రావం నిబంధనల సవరణ సందర్భం గా నిర్వచిస్తారు. తదనుగుణం గా ‘‘అత్యాచారం, వావివరుసల్లేని బలాత్కారపు సంబంధం’ వంటి సంఘటనల బాధితులు (దివ్యాంగులు, మైనర్ల)’’ వంటివారిని ఈ చట్టపరిధి లో చేరుస్తారు.
• అయితే, గర్భస్థ పిండం అసాధారణ లోపాల తో ఉన్నట్లు వైద్యుల బోర్డు నిర్ధారించే సందర్భాల్లో గర్భస్రావాని కి పిండదశ వ్యవధి పరిమితి వర్తించదు. సంబంధిత వైద్య బోర్డు ఏర్పాటు, సభ్యుల నియామకం, విధులు తదితరాల ను ఈ చట్టం కింద నిబంధనల్లో చేరుస్తారు.
• గర్భస్రావం చేయించుకున్న మహిళ పేరు, ఇతర వివరాల ను అప్పటికి అమలులో గల చట్టం నిర్దేశించిన వ్యక్తి కి మినహా మరెవరికీ వెల్లడించరాదు.
చికిత్స లో భాగం గా, వంశాభివృద్ధి, మానవతా దృక్పథం/సామాజిక కారణాల ప్రాతిపదికన మహిళల కు సురక్షిత, చట్టబద్ధ గర్భస్రావ సేవలు విస్తరించేలా చూడటమే ‘‘వైద్యపరం గా గర్భస్రావం బిల్లు-2020’’ లక్ష్యం. ప్రతిపాదిత సవరణల లో కొన్ని ‘‘వైద్యపరం గా గర్భస్రావ చట్టం-1971’’ లోని ఉప విభాగాల కు ప్రత్యామ్నాయం గానూ, కొన్ని విభాగాల కింద కొత్త నిబంధనల ను చేర్చడానికి ఉద్దేశించినవి. అంతేకాకుండా, కొన్ని నిర్దిష్ట పరిస్థితుల లో గర్భస్రావం కోసం గర్భస్థ పిండదశ వ్యవధి పరిమితి ని పెంచేందుకు, సురక్షిత సేవల అందుబాటుకు ఉద్దేశించినవి. కఠిన పరిస్థితుల నడుమ సమగ్ర, సురక్షిత గర్భస్రావం, సంరక్షణ సేవలపై రాజీపడే ప్రసక్తి లేకుండా చూడటం ఒక ప్రధానాంశం.
మహిళల భద్రత, శ్రేయస్సు దిశగా ఇదొక ముందడుగు కాబట్టి అనేకమంది మహిళలు దీనిద్వారా లబ్ధిపొందుతారు. లైంగిక హింస కారణం గా గర్భం దాల్చడం, గర్భస్థ పిండం అసాధారణ లోపాలకు గురికావడం వంటి కారణాలవల్ల వయసు, గర్భస్థ పిండదశ వ్యవధి పరిమితుల ను అధిగమించి మహిళలు గర్భస్రావం చేయించుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో గర్భస్రావాని కి అనుమతి కోరుతూ ఇటీవలి కాలం లో కోర్టుల లో అనేక అభ్యర్థనలు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రతిపాదిత గర్భస్థ పిండదశ వ్యవధి పెంపువల్ల మహిళల ఆత్మగౌరవం, స్వయం నిర్ణయాధికారం, గోప్యతల కు భరోసా ఇస్తూ వారికి న్యాయం లభించేలా చూడవచ్చు. వైద్యపరం గా సాంకేతికత ముందడుగుతోపాటు మహిళల కు సురక్షిత గర్భస్రావ సేవలు అందుబాటును పెంచే దిశగా వివిధ భాగస్వాముల తో, ఇతర మంత్రత్వ శాఖల తో విస్తృత సంప్రదింపుల అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చట్టం లో సవరణల ను ప్రతిపాదించింది.
**********